Pawan Kalyan : ఇంత కులపిచ్చి పెట్టుకుని CM ఎలా అవుతావు పవన్ కళ్యాణ్ ?
Pawan Kalyan : బాబోయ్ ఏంటిది. ఇంత కులపిచ్చి ఏంటసలు. మరీ ఇంత కులపిచ్చి ఉంటే అసలు రాజకీయాల్లో కుదురుతుందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కులపిచ్చి మామూలుగా లేదు. నేను భారతీయుడిని అంటారు. ఆ తర్వాత కాపు కులస్తుడిని అంటారు. అసలు ఇవన్నీ ఎందుకు. నీ కులం గురించి ఎవరికి కావాలి. నీ బాధంతా ఏంటి. కాపు కుల ఓట్లన్నీ నీకు కావాలా? అందుకేనా.. బహిరంగ సభల్లో నేను కాపోడిని.. కాపోడిని అంటూ తెగ చెప్పుకుంటున్నావు.
అసలే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఏం చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. చంద్రబాబు పల్లకి మోస్తున్నారు. ఆయన పల్లకి మోస్తూ ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్థం కావడం లేదు. కాపు ఓట్ల కోసం చివరకు దేహీ అనేందుకు కూడా సిద్దమయినట్టు తెలుస్తోంది. తన వైపునకు కాపు ఓట్లను తెచ్చుకొని వైసీపీకి కాపులను వ్యతిరేకంగా చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది.కాపుల్లో సీఎం జగన్ పై వ్యతిరేకత వచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కాపుల రిజర్వేషన్ పై జగన్ ఒక స్టాండ్ తీసుకుంటే దాన్ని కూడా పవన్ తప్పు పట్టారు.
Pawan Kalyan : కాపుల రిజర్వేషన్ పై జగన్ స్టాండ్ ను పవన్ ఎందుకు తప్పు పట్టినట్టు
ఇక వారాహి యాత్ర మొదలైంది కదా. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టమున్నట్టుగా పిచ్చి వాగుడు మొదలు పెట్టారు పవన్. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పినందుకు కాపులు జగన్ కు ఓటేశారని.. కానీ.. తర్వాత కాపులను రిజర్వేషన్ ఇవ్వనని ఇప్పుడు అంటున్నారని.. ఆయన హామీలను నమ్మే కాపులంతా ఆయనకు ఓటేశారని.. 60 శాతం వైసీపీకి, 30 శాతం జనసేనకు వేశారని పవన్ అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. 2014 ఎన్నికల్లో కాపుల రిజర్వేషన్ ను అడ్డం పెట్టుకొని గెలిచిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు పవన్ అంటూ ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి.. దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.