Home » Andhra Pradesh » Pawan Kalyan Clarity On Alliance With Tdp
andhra pradesh

Pawan Kalyan : ముఖ్యమంత్రి రేస్ లో లేనని ముందే చెప్పేసిన పవన్ కళ్యాణ్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 12, 2023, 1:30 pm
Advertisement

Pawan Kalyan : మచిలీపట్నం జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలకు ఆ తర్వాత ఇటీవల గురువారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకుండా పోయింది. కాపు సామాజిక వర్గంలో ఎవరు ముఖ్యమంత్రి కాలేదని బాధపడుతున్నారు. మీరు ఓట్లు వేయండి నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పిన పవన్.. మే 11 వ తారీకు మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో తాను ముఖ్యమంత్రి రేసులో లేనని స్పష్టం చేశారు.

Advertisement

Pawan Kalyan Clarity on Alliance With TDP

కానీ వైయస్ జగన్ నీ ఓడిస్తానని… పొత్తులతో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పదవీకాంక్ష కంటే రాష్ట్ర భవిష్యత తనకు ముఖ్యమని పేర్కొన్నారు. పొత్తులు అనేవి ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం అనీ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి.. అందుబాటులో ఉంటానని పవన్ వ్యాఖ్యానించారు.

Advertisement

Pawan Kalyan Clarity on Alliance With TDP

ఈసారి వైసీపీ దాస్టికాన్ని చాలా బలంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. గతంలో కంటే ఇప్పుడు జనసేన పార్టీకి మరింత బలం పెరిగిందని పవన్ అన్నారు. పొలిటికల్ ప్రయాణం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే అని వైసిపి పాలన నుండి విముక్తి చేయటం కోసమే అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి వరించాలి తప్ప దాని వెనకాల.. పడాల్సిన అవసరం లేదని.. పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి