Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిత్యం ఏదో ఒక మంచి పని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తాను ప్రజల మనిషిని అని నిరూపించుకుంటున్నారు.. తాజాగా తన సొంత నిధులతో అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లి స్కూల్‌కు క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఇటీవల మైసూరవారిపల్లి గ్రామసభకు వెళ్లగా, అక్కడి స్కూల్‌కు ఆటస్థలం లేదన్న విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. దసరాలోపు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నెరవేర్చారు.
పవన్ కళ్యాణ్ తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. దీనికి సంబంధించిన పత్రాలను మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీ సభ్యులకు అందజేశారు. కడప జిల్లా మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియను సీఎం చంద్రబాబు నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి బుధవారం రాత్రి అందజేశారు.
పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి రూ. 60 లక్షలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలాన్ని కొనుగోలు. చేశారు. ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట డిప్యూటీ సీఎం రిజిస్ట్రేషన్ చేయించారు. తాము ఎంతోమంది చదువులకు సాయం చేసినా సరే ఎప్పుడూ బయటకు చెప్పలేదన్నారు. మైసూరవారిపల్లి స్కూల్ ఆటస్థలం కోసం.. ముందు రూ.20 లక్షలు ఇచ్చి మిగిలిన మొత్తానికి దాతల సహకారం తీసుకోవాలనుకున్నట్లు తెలిపారు. కానీ ఆట స్థలం విషయంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో మొత్తం రూ.60 లక్షలు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు.ప్రతి పాఠశాలకు రెండేసి చొప్పున, క్రీడా సామాగ్రి కిట్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. . ఒక్కొక్క కిట్ దాదాపు 25 వేల రూపాయలు, మొత్తం కిట్ల కు 16 లక్షల రూపాయలు అవసరం ఉండటంతో, కిట్లకు అవసరమైన నిధులను CSR ఫండ్స్ ద్వారా సేకరిస్తామని జిల్లా కలెక్టర్ S. షాన్మోహన్ తెలియజేశారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.