
Pawan kalyan : పవన్ కళ్యాణ్ న్యూ గెటప్ అదిరింది.. ఇంతకి ఎక్కడికి వెళ్లాడు..!
Pawan kalyan : సిక్కు ధర్మ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాందేడ్ పుణ్యక్షేత్రం ఆదివారం ఆధ్యాత్మిక ఉత్సవంతో కళకళలాడింది. సిక్కుల తొమ్మిదవ గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 350వ అమరవీరుల సంస్మరణ సందర్భంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘హింద్ దీ చాదర్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు స్థానిక సిక్కు సంఘాలు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆయన నేరుగా సిక్కుల పవిత్ర క్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించారు.
Pawan kalyan : పవన్ కళ్యాణ్ న్యూ గెటప్ అదిరింది.. ఇంతకి ఎక్కడికి వెళ్లాడు..!
సిక్కు సంప్రదాయం ప్రకారం దస్తార్ ధరించి, దర్బార్ సాహిబ్‌లో ప్రార్థనలు నిర్వహించి, ‘చౌర్ సాహిబ్’ సేవలో పాల్గొన్నారు.ధర్మం, మానవ విలువల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ జీ త్యాగాన్ని స్మరించుకుంటూ జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించింది. గురుద్వారా కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్‌ను శాలువాతో సత్కరించారు.గురుద్వారా దర్శనం అనంతరం మోదీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొనగా, లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు.
వేదికపై పవన్ కళ్యాణ్ గురు తేగ్ బహదూర్ జీ త్యాగస్ఫూర్తిని కొనియాడుతూ, దేశ ఐక్యతకు వారి బోధనలు ఆదర్శమని పేర్కొన్నారు.సిక్కు మతానికి చారిత్రకంగా కీలకమైన నాందేడ్‌లో, దేశవ్యాప్తంగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచింది. కార్యక్రమాలు ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ పర్యటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
Kavitha : తెలంగాణ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల సరసన,…
Chintakayala Vijay : టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ ఇటీవల తన సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు…
Anasuya : వివాదాస్పద అంశాలపై మౌనం వహించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో…
Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్…
Post Office Franchise 2026 : సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ మద్దతు కోరుకునే…
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
This website uses cookies.