Pawan kalyan : పవన్ కళ్యాణ్ న్యూ గెటప్ అదిరింది.. ఇంత‌కి ఎక్క‌డికి వెళ్లాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan kalyan : పవన్ కళ్యాణ్ న్యూ గెటప్ అదిరింది.. ఇంత‌కి ఎక్క‌డికి వెళ్లాడు..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 January 2026,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan kalyan : పవన్ కళ్యాణ్ న్యూ గెటప్ అదిరింది.. ఇంత‌కి ఎక్క‌డికి వెళ్లాడు..!

Pawan kalyan : సిక్కు ధర్మ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాందేడ్ పుణ్యక్షేత్రం ఆదివారం ఆధ్యాత్మిక ఉత్సవంతో కళకళలాడింది. సిక్కుల తొమ్మిదవ గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 350వ అమరవీరుల సంస్మరణ సందర్భంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘హింద్ దీ చాదర్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉదయం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు స్థానిక సిక్కు సంఘాలు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆయన నేరుగా సిక్కుల పవిత్ర క్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించారు.

Pawan kalyan పవన్ కళ్యాణ్ న్యూ గెటప్ అదిరింది ఇంత‌కి ఎక్క‌డికి వెళ్లాడు

Pawan kalyan : పవన్ కళ్యాణ్ న్యూ గెటప్ అదిరింది.. ఇంత‌కి ఎక్క‌డికి వెళ్లాడు..!

Pawan kalyan పవన్ లుక్ అదరహో…

సిక్కు సంప్రదాయం ప్రకారం దస్తార్ ధరించి, దర్బార్ సాహిబ్‌లో ప్రార్థనలు నిర్వహించి, ‘చౌర్ సాహిబ్’ సేవలో పాల్గొన్నారు.ధర్మం, మానవ విలువల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ జీ త్యాగాన్ని స్మరించుకుంటూ జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించింది. గురుద్వారా కమిటీ సభ్యులు పవన్ కళ్యాణ్‌ను శాలువాతో సత్కరించారు.గురుద్వారా దర్శనం అనంతరం మోదీ మైదాన్‌లో ఏర్పాటు చేసిన ప్రధాన బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొనగా, లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు.

వేదికపై పవన్ కళ్యాణ్ గురు తేగ్ బహదూర్ జీ త్యాగస్ఫూర్తిని కొనియాడుతూ, దేశ ఐక్యతకు వారి బోధనలు ఆదర్శమని పేర్కొన్నారు.సిక్కు మతానికి చారిత్రకంగా కీలకమైన నాందేడ్‌లో, దేశవ్యాప్తంగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచింది. కార్యక్రమాలు ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ పర్యటనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది