Home » Andhra Pradesh » Pawan Kalyan Promise Balineni Srinivas
andhra pradesh

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 5, 2025, 7:00 pm
Advertisement

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా ఏడాది పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి కౌంటర్‌గా వైసీపీ ‘జనచైతన్య యాత్ర’ వంటి కార్యక్రమాలతో తిరిగి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాగా వైసీపీకి గుడ్‌బై చెప్పిన కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. అయితే బాలినేని చేరిక తర్వాత రాజకీయంగా అతనికి కచ్చితమైన స్థానం లభించకపోవడం, టీడీపీ నేతలు ఆయనతో కలిసి పనిచేసేందుకు నిరాకరించడం వల్ల, కూటమి సమీకరణాల్లో అంతర్గత విభేదాలు స్పష్టమవుతున్నాయి.

Advertisement

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan బాలినేని నాకు ఆత్మీయుడు.. పవన్ ఈ ఒక్క డైలాగ్ తో కట్టిపడేసాడు

బాలినేనిపై టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ అందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న బాలినేని తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టారని ఆరోపిస్తూ, ఇప్పుడు ఆయన్ని స్వీకరించడం తమకు సౌకర్యకరంగా లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం బాలినేనిపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మార్కాపురం సభలో వేదికపై బాలినేనిని ప్రాముఖ్యతతో కూర్చోబెట్టి, తనకు అత్యంత సన్నిహితుడు అని అభివర్ణించారు. గతంలో వైసీపీలో ఉన్నా తనకు వ్యక్తిగతంగా బాలినేనితో ఎలాంటి విభేదాలు లేవని, రాజకీయ అవగాహన ఉన్న నేత అని కొనియాడారు. కుటుంబంలోకి కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కొంత ఒడిదొడుకులు సహజమని, వాటిని అధిగమించి కలిసి పనిచేయాలని కూటమి నేతలకు సూచించారు.

Advertisement

ఈ వ్యాఖ్యలతో కూటమిలో బాలినేని స్థానం పటిష్టం కానే అవకాశాలు కనిపిస్తున్నా, టీడీపీ జిల్లా నాయకుల సహకారం లేకుండా అది సాధ్యం కాదనే వాస్తవం అలాగే ఉంది. బాలినేని తనకు గుర్తింపు లేదన్న నిరాశలో ఉన్నారని పవన్ గుర్తించి ఆయనకు మద్దతుగా మాట్లాడారు. అయినప్పటికీ, టీడీపీ నాయకులు పవన్ సూచనలను గౌరవించి బాలినేని కలిసికట్టుగా పని చేయడానికి సిద్ధపడతారా అన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. బాలినేని ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారా లేక ఆయనను పక్కన పెట్టేస్తారా అనే దానిపై కూడా వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా పవన్ వ్యాఖ్యలతో బాలినేని విషయంలో మరోసారి ఆసక్తికరంగా చర్చ నడుస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి