Pawan Kalyan – YS Jagan : నువ్ వ్యక్తిగత జీవితంలో చేసే వెధవ పనులు నాకు తెలుసు — జగన్ కి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan – YS Jagan : నువ్ వ్యక్తిగత జీవితంలో చేసే వెధవ పనులు నాకు తెలుసు — జగన్ కి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ !

Pawan Kalyan – YS Jagan : ఏంటో అసలు. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపునకు వెళ్తాయో ఎవ్వరికీ తెలియదు. అన్ని రాజకీయాల్లో ఏపీ రాజకీయాలే వేరయా అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఏపీలో ప్రస్తుతం రాజకీయ పోరు రెండు పార్టీల మధ్యకే షిఫ్ట్ అయింది. అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. అసలైన ప్రత్యర్థి పార్టీ టీడీపీ ఇక్కడ పక్కకు తప్పుకోగా.. అధికార పార్టీ వర్సెస్ జనసేనగా మారింది […]

 Authored By kranthi | The Telugu News | Updated on :2 July 2023,12:00 pm

Pawan Kalyan – YS Jagan : ఏంటో అసలు. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎటువైపునకు వెళ్తాయో ఎవ్వరికీ తెలియదు. అన్ని రాజకీయాల్లో ఏపీ రాజకీయాలే వేరయా అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఏపీలో ప్రస్తుతం రాజకీయ పోరు రెండు పార్టీల మధ్యకే షిఫ్ట్ అయింది. అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. అసలైన ప్రత్యర్థి పార్టీ టీడీపీ ఇక్కడ పక్కకు తప్పుకోగా.. అధికార పార్టీ వర్సెస్ జనసేనగా మారింది వ్యవహారం.

అసలే వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ చేసే రచ్చ మనమంతా చూశాం. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో కేవలం సీఎం జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. చివరకు వీళ్ల రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్లాయంటే ఒకరిని మరొకరు వ్యక్తిగతంగా విమర్శించుకునే వరకు వెళ్లాయి. ఇటీవల సీఎం జగన్ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడటంతో ఇక.. పవన్ కూడా సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మొదలు పెట్టారు.

pawan kalyan slams on ap cm ys jagan mohan reddy

pawan kalyan slams on ap cm ys jagan mohan reddy

Pawan Kalyan – YS Jagan : భీమవరం వారాహి యాత్రలో సీఎం జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్

తాజాగా భీమవరంలో జరిగిన వారాహి యాత్రలో సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్.. నీకే చెబుతున్నా.. చెవులు రిక్కించి విను. నీ వ్యక్తిగత జీవితం మొత్తం నాకు తెలుసు. నా వ్యక్తిగత జీవితాల గురించి నువ్వు పనికిమాలిన మాటలు మాట్లాడితే నేను చూస్తూ ఉండను. నువ్వు హైదరాబాద్ లో ఉండి ఏం చేశావో నాకు తెలుసు. చాలా లోతైన విషయాలు కూడా నాకు తెలుసు. అవన్నీ నాకు మాట్లాడటం చేతగాక కాదు.. నీ పర్సనల్ అంతా తెలుసు. కావాలంటే నీ మనిషిని పంపించు. నేను చెప్పే విషయాలు వింటే చెవుల నుంచి మీకు రక్తం వస్తుంది. నువ్వు ఏదైనా అనుకో.. ఇది వార్నింగ్ అనుకుంటావో.. ఇంకేమైనా అనుకుంటావో.. నేను మాత్రం నీకు బలమైన పోరాటం ఇవ్వబోతున్నాను.. అంటూ పవన్ కళ్యాణ్ సీఎం జగన్ కు స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది