Pithapuram : పిఠాపురంలో ఏం జరుగుతుంది.. వర్మ వర్సెస్ జనసేన ?
Pithapuram : పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్రజలు క్యూలు కట్టారు. అయితే పిఠాపురంలో ఇప్పుడు విచిత్రపరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది. పిఠాపురంలో వంద రోజుల్లోనే రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. జనసేన, టీడీపీ క్యాడర్ మధ్య నువ్వా? నేనా అన్నట్లుంది వ్యవహారం. ఒకరకంగా టీడీపీని జనసేన స్థానిక నేతలు దూరం పెడుతుంటే, ఇటు టీడీపీ నేతలు కూడా జనసేన లోకల్ లీడర్స్ ను ఇప్పటికే బాయ్ కాట్ చేశారు. అధికారంలోకి కూటమి వచ్చి వంద రోజులు కాకముందే పిఠాపరంలో టీడీపీ, జనసేన ఫైట్ పీక్స్ కు చేరింది. అధినాయకత్వం మాత్రం బాగానే ఉన్నప్పటికీ నియోజకవర్గంలో మాత్రం నేతలు రెండు చీలిపోయారు. మాజీ ఎమ్మెల్యే వర్మను జనసైనికులు దూరం పెడుతుండగా, ఇందుకు టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
పిఠాపురంలో వర్మ తన చొరవ చూపిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గం సమస్యలు అన్నీ అవగాహన ఉంది. దాంతో ఆయన అధికారులతో కలసి పనులు చేయిస్తున్నారు. అలా వర్మ తన హవాను చాటుకుంటున్నారు. ఇది జనసైనికులకు గిట్టడం లేదు అని అంటున్నారు. వారు అయితే వర్మ కాదు ఎమ్మెల్యే జనసేనది ఈ సీటు అని అధికారులతో అనడమే కాదు జనసేన మాట వినాలని గట్టిగా కోరుతున్నారుట. ఈ మధ్యలో అధికారులు పడి నలిగిపోతున్నారు. అంతే కాదు అధికారికంగా జనసేన నిర్వహించే ఏ కార్యక్రమానికి కూడా వర్మను పిలవడం లేదు అని వర్మ అనుచరులు మండిపడుతున్నారు. మా నాయకుడు త్యాగం చేయడం వల్లనే ఈ సీటు జనసేనకు వెళ్ళిందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే పవన్ డిప్యూటీ సీఎం. పైగా ఆయన కూటమిలో కీలకంగా ఉన్నారు.
Pithapuram : పిఠాపురంలో ఏం జరుగుతుంది.. వర్మ వర్సెస్ జనసేన ?
ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆయనకు ఎంతో గౌరవం ఇస్తున్నారు. దాంతో జనసైనికులు కూడా తమ మాటే పిఠాపురంలో నెగ్గాలని చూస్తున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ విషయంలో ఒక రకంగా జనసేన లోకల్ లీడర్స్ కాస్తా ఎడం పాటిస్తున్నారు. టీడీపీ నేతలు కూడా అంతే దూరం పాటిస్తున్నారు. దాంతో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలు రెండుగా చీలి కత్తులు దూస్తున్నాయని అంటున్నారు. జనసేనకు పవన్ కి ఇది పర్మనెంట్ సీటు అని పవన్ రాజకీయల్లో ఉన్నంతవరకూ పిఠాపురం వదలరని అంటున్నారు. దాంతో వర్మకు ఏ రకంగానూ రాజకీయంగా ఎలివేషన్ లేకుండా పోతోంది అని ఆయన వర్గం మధన పడుతోంది. ఎమ్మెల్సీ సీటు కూడా వర్మకు దక్కలేదు. మరి ఫ్యూచర్ లో వస్తుందో రాదో తెలియదు.
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
This website uses cookies.