బావగారూ బాగున్నారా – కొత్త వీడియో బయటపెట్టిన మాజీ మంత్రి నారాయణ మరదలు కృష్ణ ప్రియ !
టీడీపీ మాజీమంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లో భార్య ఉండగానే అన్నం తీసుకురాలేదని తనని నారాయణ కొట్టినట్లు అనేక చక్రవాదులకు గురి చేసినట్లు మొన్న సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. నారాయణ తనపై డేగ ఒక పిట్టపై కన్నేసినట్లు తనపై కన్ను వేశాడని ఆరోపించారు. కాగా ఇప్పుడు తాజాగా మరో కొత్త వీడియో మంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ రిలీజ్ చేశారు. దీనిలో.. తన మానసిక స్థితి అంత బాగానే ఉందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తాను ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆవేదం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ మరియు ఏపీ ల మంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉందని ఆరోపించారు. తాను మాట్లాడుతున్నది పూర్తి వాస్తవమని ఎటువంటి పరీక్షలకు అయినా ఎదుర్కోవటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో నారాయణ మార్కు అనాలసిస్ పరీక్షకు సిద్ధం కావాలని సవాలు చేశారు. తాను ఒక్కదానినే బాధితురాలిని కాదని నారాయణ విద్యాసంస్థల తో పాటు మెడికల్ కాలేజీలలో చాలామంది మహిళలు నారాయణకు బాధితులేనని ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలకి విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో తన వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు లేవని కేవలం ఒక బాధితురాలిగా మాత్రమే తాను సోషల్ మీడియా వేదికగా ముందుకు వచ్చినట్లు స్పష్టం చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని నీవు నమ్ముకుంటే నీకు అసలు న్యాయం జరగదు…. pic.twitter.com/wc9W8Me0xl
— Anitha Reddy (@Anithareddyatp) August 1, 2023