
prudhvi raj comments on ambati rambabu
Prudhvi Raj : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గానీ, టాలీవుడ్ లో గానీ ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే బ్రో మూవీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. బ్రో మూవీలో నటించింది పవన్ కళ్యాణ్ కావడం.. ఆయన రాజకీయాల్లోనూ ఉండటంతో ఏపీ రాజకీయాల్లో ఆ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అదంతా పక్కన పెడితే బ్రో సినిమాలో కొన్ని రాజకీయాలకు సంబంధించిన సీన్లు ఉన్నాయని.. అవి కావాలనే కొందరు నాయకులను ఉద్దేశించి తీసినవి అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
బ్రో సినిమాలో నటించిన పృథ్వీ ఒక పాత్ర వేశారు. ఆ పాత్రలో భాగంగా ఆయన వేసిన క్యారెక్టర్ అచ్చం ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందని అంటున్నారు. అంబటి రాంబాబులా మాట్లాడటం, ఆయనలా ప్రవర్తించడం, ఆయన నడవడం అచ్చం.. అంబటి రాంబాబులా ఆయన పాత్ర ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.తాజాగా బ్రో సక్సెస్ మీట్ లో మాట్లాడిన పృథ్వీ అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు అంటూ సంచలన కామెంట్లు చేశారు. బ్రో సినిమాలో తాను మంత్రి అంబటి రాంబాబు పాత్ర వేశాను.. అని కామెంట్లు రావడంపై స్పందించారు. నాకు అంబటి రాంబాబు ఎవరో తెలియదు.
prudhvi raj comments on ambati rambabu
శ్యాంబాబు వర్సెస్ రాంబాబు.. అంటూ సోషల్ మీడియాలో నా పాత్రకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ రాంబాబు ఎవరో తెలియదు. ఆస్కార్ లేవల్ నటుడేమీ కాదు ఆయన. ఆయన్ను నేనెందుకు ఇమిటేట్ చేస్తాను. నాకు సముద్రఖని గారు ఏం చెప్పారంటే.. ఒక పనికిమాలిన వెధవ, బాధ్యత లేని వెదవ, బారుల్లో తాగుతూ.. అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని డైరెక్టర్ నాకు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా నేను చేశాను అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.