Prudhvi Raj : అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు.. నటుడు పృథ్వీ షాకింగ్ కామెంట్స్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: August 1, 2023, 7:00 pm

Prudhvi Raj  : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గానీ, టాలీవుడ్ లో గానీ ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే బ్రో మూవీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. బ్రో మూవీలో నటించింది పవన్ కళ్యాణ్ కావడం.. ఆయన రాజకీయాల్లోనూ ఉండటంతో ఏపీ రాజకీయాల్లో ఆ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అదంతా పక్కన పెడితే బ్రో సినిమాలో కొన్ని రాజకీయాలకు సంబంధించిన సీన్లు ఉన్నాయని.. అవి కావాలనే కొందరు నాయకులను ఉద్దేశించి తీసినవి అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

బ్రో సినిమాలో నటించిన పృథ్వీ ఒక పాత్ర వేశారు. ఆ పాత్రలో భాగంగా ఆయన వేసిన క్యారెక్టర్ అచ్చం ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలి ఉందని అంటున్నారు. అంబటి రాంబాబులా మాట్లాడటం, ఆయనలా ప్రవర్తించడం, ఆయన నడవడం అచ్చం.. అంబటి రాంబాబులా ఆయన పాత్ర ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.తాజాగా బ్రో సక్సెస్ మీట్ లో మాట్లాడిన పృథ్వీ అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదు అంటూ సంచలన కామెంట్లు చేశారు. బ్రో సినిమాలో తాను మంత్రి అంబటి రాంబాబు పాత్ర వేశాను.. అని కామెంట్లు రావడంపై స్పందించారు. నాకు అంబటి రాంబాబు ఎవరో తెలియదు.

prudhvi raj comments on ambati rambabu

prudhvi raj comments on ambati rambabu

Prudhvi Raj : అంబటి రాంబాబు ఆస్కార్ లేవల్ నటుడా?

శ్యాంబాబు వర్సెస్ రాంబాబు.. అంటూ సోషల్ మీడియాలో నా పాత్రకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ రాంబాబు ఎవరో తెలియదు. ఆస్కార్ లేవల్ నటుడేమీ కాదు ఆయన. ఆయన్ను నేనెందుకు ఇమిటేట్ చేస్తాను. నాకు సముద్రఖని గారు ఏం చెప్పారంటే.. ఒక పనికిమాలిన వెధవ, బాధ్యత లేని వెదవ, బారుల్లో తాగుతూ.. అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని డైరెక్టర్ నాకు చెప్పారు. ఆయన చెప్పినట్టుగా నేను చేశాను అంటూ పృథ్వీ చెప్పుకొచ్చారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp