Raghu rama krishna raju : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీ రెబల్ ఎంపీ (నరసాపురం) రఘురామకృష్ణరాజుకు మధ్య నెలకొన్న కోల్డ్ వార్ కాస్తా ఏడాదికి పైగా హాట్ వార్ గా మారింది. అది ఈ మధ్య మరింత ముదిరింది. రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా సాయంతో డర్టీ ఫెల్లో మాదిరి పాలిటిక్స్ చేయటంతో ఆయనకి ఏపీ పోలీసులు తమదైన శైలిలో సన్మానం చేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రఘురామకృష్ణరాజు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు మొదలు పెట్టారు. రోజుకొకరు చొప్పున పెద్దలను కలుస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఫిర్యాదుల పరంపర కొనసాగించారు.
సీబీసీఐడీ సీన్ కి ముందు రఘురామకృష్ణరాజు పచ్చ మీడియా మద్దతుతో రచ్చ (బండ) రచ్చ చేశారు. అనంతరం తన స్టైల్ మార్చారు. ప్రస్తుతం ఉత్తరాల ఉద్యమం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి రోజుకొక లెటర్ రాస్తూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ప్రతిపక్షానికి మించి ప్రభుత్వ లోపాలను పట్టి చూపుతున్నారు. తద్వారా వైఎస్ జగన్ పై తన అక్కసును వెల్లగక్కుతున్నారని అధికార పార్టీ అంటోంది. ఈ నేపథ్యంలో అసలు రఘురామకృష్ణరాజు ఎందుకిలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారనే అనుమానం ప్రతిఒక్కరికీ రాకమానదు.
రఘురామకృష్ణరాజు రిచెస్ట్ ఎంపీ. రాజు అనే పేరుకు తగ్గట్లే సౌండ్ పార్టీ. అలాంటి వ్యక్తికి సహజంగానే ఇగో ఫీలింగ్ ఉంటుంది. దాంతో వైఎస్సార్సీపీలో తనకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం, హోదా దక్కాలని ఆశించారు. కానీ అక్కడ వైఎస్ జగనే ఫైనల్. రఘురామకృష్ణరాజును కూడా అందరిలాగే ఈక్వల్ గా ట్రీట్ చేయటంతో అతను బాగా హర్ట్ అయ్యాడు. చిన్నగా వైఎస్ జగన్ కి దూరం జరగటం మొదలు పెట్టాడు. అయినా వైఎస్ జగన్ పట్టించుకోలేదు. దీంతో రఘురామకృష్ణరాజు చిల్లర చిల్లరగా అల్లరి చేయటం ఆరంభించాడు. వైఎస్ జగన్ వ్యతిరేక మీడియాకి కావాల్సింది ఇలాంటోళ్లే. దీంతో వాళ్లు రఘురామకృష్ణ రాజును నెత్తిన పెట్టుకున్నారు. అతణ్నే మెయిన్ అపొజిషన్ లీడర్ రేంజ్ లో న్యూస్ కవరేజీ ఇస్తున్నారు.
ఎంపీ రఘురామకృష్ణరాజుకు అసలు విషయం అర్థంకావట్లేదు. వైఎస్ జగన్ ని టార్గెట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో గోబెల్స్ మాదిరిగా ప్రవర్తించే ఆ రెండు పత్రికలు, ఆ రెండు టీవీ ఛానెళ్లు రఘురామకృష్ణరాజును హీరోగా చూపిస్తున్నాయి. ఆయనకేమో అది స్థాన బలిమి కానీ తన బలిమి కాదనే సంగతి అవగాహన కావట్లేదు. టీడీపీకి, బీజేపీకి ఫేవర్ చేస్తూ పొలిటికల్ గా తననుతాను నష్టపరచుకుంటున్నారు. వైఎస్ జగన్ పై పైచేయి సాధిస్తున్నట్లు కలలు కంటున్నారు. రఘురామకృష్ణరాజు ఆ లోకంలోంచి ఎప్పుడు బయటికి వస్తారో.
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
This website uses cookies.