
Chandrababu : చంద్రబాబుపై కాంగ్రెస్ ప్రశంసల జల్లు.. భవిష్యత్‌లోఇలా ముందుకు వెళ్లాలంటూ సూచన..!
Chandrababu : కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తనదైన శైలిలో ప్రజా సేవ చేసుకుంటూ ముందుకు వెళతున్నాడు. కెరీర్‌లో నాలుగోసారి సీఎం అయిన చంద్రబాబు ఇప్పుడు ఏపీని అభివృద్ధి చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలంటే ఒకప్పుడు ఉప్పూనిప్పూగా ఉండేవి. టీడీపీ ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇక మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ పార్టీలు రెండూ దగ్గరయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. మడకశిర మండలం గుండుమల గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. మడకశిరలో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంపై మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం ప్రజలను బలవంతంగా తరలించడం, నిర్బంధించడం వంటివి లేవని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు . ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఇలా సాదాసీదాగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు. మరోవైపు మడకశిర నియోజకవర్గంలో పదేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రైతుల సమస్యలు, తాగు, సాగునీటిపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని రఘువీరారెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రకటన పట్ల మడకశిర వాసిగా హర్షిస్తున్నానని అన్నారు.
Chandrababu : చంద్రబాబుపై కాంగ్రెస్ ప్రశంసల జల్లు.. భవిష్యత్‌లోఇలా ముందుకు వెళ్లాలంటూ సూచన..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిరకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వానికి శక్తిని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన ప్రజా వ్యతిరేక విధానాలకు ముఖ్యమంత్రి స్వస్తి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఇక మడకశిరలో రూ.60 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు కడతామని చంద్రబాబు ప్రకటించారు. బిందు సేద్యం విధానం అమలు సహా నూతనంగా పరిశ్రమలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.