Chandrababu : చంద్ర‌బాబుపై కాంగ్రెస్ ప్ర‌శంస‌ల జ‌ల్లు.. భ‌విష్య‌త్‌లోఇలా ముందుకు వెళ్లాలంటూ సూచ‌న‌..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 3 August 2024, 1:00 pm

Chandrababu : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో ఏపీకి చంద్రబాబు ముఖ్య‌మంత్రి అయ్యాడు. ఆయ‌న త‌న‌దైన శైలిలో ప్ర‌జా సేవ చేసుకుంటూ ముందుకు వెళ‌తున్నాడు. కెరీర్‌లో నాలుగోసారి సీఎం అయిన చంద్ర‌బాబు ఇప్పుడు ఏపీని అభివృద్ధి చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ నాయ‌కులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలంటే ఒకప్పుడు ఉప్పూనిప్పూగా ఉండేవి. టీడీపీ ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. ఇక మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ పార్టీలు రెండూ దగ్గరయ్యాయి. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు.

Chandrababu బాబుపై ప్ర‌శంస‌లు..

చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. మడకశిర మండలం గుండుమల గ్రామంలో పింఛన్లు పంపిణీ చేశారు. మడకశిరలో చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమంపై మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కోసం ప్రజలను బలవంతంగా తరలించడం, నిర్బంధించడం వంటివి లేవని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రశంసలు కురిపించారు . ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఇలా సాదాసీదాగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగించాలని సూచించారు. మరోవైపు మడకశిర నియోజకవర్గంలో పదేళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న రైతుల సమస్యలు, తాగు, సాగునీటిపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని రఘువీరారెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రకటన పట్ల మడకశిర వాసిగా హర్షిస్తున్నానని అన్నారు.

Chandrababu : చంద్ర‌బాబుపై కాంగ్రెస్ ప్ర‌శంస‌ల జ‌ల్లు.. భ‌విష్య‌త్‌లోఇలా ముందుకు వెళ్లాలంటూ సూచ‌న‌..!

Chandrababu : చంద్ర‌బాబుపై కాంగ్రెస్ ప్ర‌శంస‌ల జ‌ల్లు.. భ‌విష్య‌త్‌లోఇలా ముందుకు వెళ్లాలంటూ సూచ‌న‌..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మడకశిరకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వానికి శక్తిని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన ప్రజా వ్యతిరేక విధానాలకు ముఖ్యమంత్రి స్వస్తి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఇక మడకశిరలో రూ.60 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే ఈ ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు కడతామని చంద్రబాబు ప్రకటించారు. బిందు సేద్యం విధానం అమలు సహా నూతనంగా పరిశ్రమలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "Korean Kanakaraju Censor Review : కొరియన్ కనకరాజు సెన్సార్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..?"

  2. "TTN SPECIAL ANALYSIS : బంకీపూర్ లో అంత ఈజీ గా ప్రశాంత్ కిషోర్ ఎలా గెలిచాడు ?"

  3. "Indiramma House: పేదలకు బంపర్ ఛాన్స్.. రూ.40 లక్షల ఫ్లాట్.. కేవలం రూ.6 లక్షలకే .. అర్హతలు, అప్లై విధానం, పూర్తి వివరాలివే..!"

  4. "PM-KISAN : రైతులకు భారీ శుభవార్త.. 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు జమ.. కొత్త లబ్ధిదారులపై కేంద్రం కీలక ప్రకటన"

  5. "Pradeep Rawat : టాలీవుడ్ స్టార్ విలన్ ప్రదీప్ రావత్.. కోట్ల ఆస్తి వెనుక అసలు కథ..!"

  6. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  7. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp