Rohit Sharma : నా వైపు చూస్తావేంటంటూ సుందర్‌పై రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్
Rohit Sharma : ప్రస్తుతం టీమిండియా శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన భారత్- శ్రీలంక తొలి వన్డే టైగా మారింది. మందకొడి పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. సిరాజ్, దూబె, కుల్దీప్ యాదవ్, వాష్టింగ్టన్ సుందర్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 230 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దీంతో మ్యాచ్ టై అయింది. భారత బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ(47 బంతుల్లో 58) హాఫ్ సెంచరీ బాదగా, కేఎల్ రాహుల్ (31), అక్షర్ పటేల్ (33), శివమ్ దూబె (25) లు రాణించడంతో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఈ టోర్నీకి సూపర్ ఓవర్ నిబంధన లేకపోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ, చరిత్ అసలంక చెరో మూడు వికెట్లు తీశారు. దునిల్ వెల్లలాగే రెండు వికెట్లు పడగొట్టాడు. అసిత ఫెర్నాండో, అఖిల దనంజయ లు చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా ఇన్నింగ్స్ 29వ ఓవర్‌ను వాషింగ్టన్ సుందర్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతిని లంక బ్యాటర్ దునిత్ వెల్లలగే షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. బంతి అతడి ప్యాడ్లను తాకింది.
Rohit Sharma : నా వైపు చూస్తావేంటంటూ సుందర్‌పై రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్
ఎల్బీడబ్ల్యూ కోసం బౌలర్ సుందర్‌తో పాటు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశాడు. అయితే.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అయితే రివ్యూకి వెళ్లాలా అని స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ వైపు చూశాడు సుందర్ . రివ్యూకి వెళ్లాలా అంటూ రోహిత్ అడిగాడు. అయితే.. సుందర్ కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోయాడు. నీకేమనిపిస్తుందని అన్నట్లుగా రోహిత్ వైపు చూశాడు. ఇంకో వైపు రివ్య్వూ తీసుకునేందుకు సమయం ముగిసి పోతుండడంతో సుందర్ పై రోహిత్ సీరియస్ అయ్యాడు. ఏంటీ… నా వైపు ఎందుకు చూస్తున్నావు. అయినా నాకేం కనిపిస్తుందని అడుగుతున్నావు..? నువ్వు చేయాల్సిన పని కూడా నేనే చేయాలా..? అంటూ గట్టిగా అన్నాడు రోహిత్. ఆ వెంటనే నవ్వేశాడు. రోహిత్ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి
Sleep Paralysis : ఇది అందరిలోనూ జరిగే చాలా సర్వసాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఎదుర్కొని ఉంటారు. కానీ…
Urinary Tract Infection : ఎక్కువగా మహిళలలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలను ఒకటి మూత్రణాల ఇన్ఫెక్షన్ (UTI ).…
Lucky Trees : జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది.ఆ రోజున కొన్ని ప్రత్యేక మొక్కలను నాటడం వల్ల జీవితంలో ఆనందం,…
TTD Recruitment 2025 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రిక్రూట్మెంట్ 2025లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి…
Ashada Masam : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఆషాడ మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక…
Health Tips : ఎంతో పవిత్రంగా భావించే ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఔషధ ఘనీ అని…
Kannappa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది.…
This website uses cookies.