Categories: andhra pradeshNews

Vijayawada : వామ్మో.. ఏంది ఆ వర్షం.. విజ‌యవాడ‌లో తొలి సారి అంత భారీ వ‌ర్షం

Advertisement
Advertisement

Vijayawada : తుఫాను ప్ర‌భావంతో అంత‌టా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కనీవినీ ఎరుగని వర్షం పడింది. ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో వర్షం కురవడం గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు కుండపోత వాన కురవడంతో సిటీలోని పలు కాలనీలు జలమయంగా మారాయి. మరికొన్ని చోట్ల ఏకంగా వీధుల్లో నాలుగు అడుగుల మేర వరద చేరింది. శివార్లలోని కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Vijayawada భారీ వ‌ర్షం..

నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీటమునిగాయి. రైల్వేట్రాక్‌ అండర్‌ పాస్‌ వద్ద 4 బస్సులు నీట మునగగా క్రేన్ల సాయంతో అధికారులు వాటిని బయటకు తీశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలో 30 ఏళ్లగా ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. ఒకే రోజు 29 సెం. మీ వర్షపాతం నమోదయింది. గత రెండు రోజులుగా విజయవాడ మహానగరంలో కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆటోనగర్, నుంచి బెంజ్ సర్కిల్ వరకు వరద నీరు భారీగా రహదారిపైకి వచ్చి చేరింది.

Advertisement

Vijayawada : వామ్మో.. ఏంది ఆ వర్షం.. విజ‌యవాడ‌లో తొలి సారి అంత భారీ వ‌ర్షం

వ‌ర్షాల కారణంగా గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కారు కొట్టుకుపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. బస్సులు లాంటి భారీ వాహనాలు పడవల మాదిరి మారాయి. మొత్తంగా 69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న విజయవాడ పట్టణంలోని అన్ని కాలనీలు, శివారు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. సరైన డ్రెయిన్లు లేకపోవటం విజయవాడకు శాపంగా మారింది. పడే వాన భారీగా ఉండటం..బయటకు వెళ్లాల్సిన నీళ్ల మార్గం లేకపోవటంతో.. విజయవాడ మొత్తం జలమయంగా మారింది. విజయవాడలో వర్షం 31వ తేదీ (శనివారం) ఉదయం 17సెంటీమీటర్లు అయితే.. సాయంత్రం నాలుగు గంటల నాటికి 12.1 సెంటీమీటర్ల వ‌ర్షం కురిసింది.

Advertisement

Recent Posts

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

43 mins ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

Eating Snails : నత్తలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటే నమ్ముతారా… కానీ ఇది నిజం… ఎలాగో తెలుసుకోండి…!

Eating Snails : నత్తల గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసే ఉంటుంది. అయితే కొన్నిచోట్ల నత్తల కూరను తినడానికి చాలా…

8 hours ago

This website uses cookies.