Vijayawada : వామ్మో.. ఏంది ఆ వర్షం.. విజయవాడలో తొలి సారి అంత భారీ వర్షం
Vijayawada : తుఫాను ప్రభావంతో అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కనీవినీ ఎరుగని వర్షం పడింది. ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో వర్షం కురవడం గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు కుండపోత వాన కురవడంతో సిటీలోని పలు కాలనీలు జలమయంగా మారాయి. మరికొన్ని చోట్ల ఏకంగా వీధుల్లో నాలుగు అడుగుల మేర వరద చేరింది. శివార్లలోని […]
ప్రధానాంశాలు:
Vijayawada : వామ్మో.. ఏంది ఆ వర్షం.. విజయవాడలో తొలి సారి అంత భారీ వర్షం
Vijayawada : తుఫాను ప్రభావంతో అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కనీవినీ ఎరుగని వర్షం పడింది. ఒక్కరోజులో ఏకంగా 29 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ స్థాయిలో వర్షం కురవడం గడిచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు కుండపోత వాన కురవడంతో సిటీలోని పలు కాలనీలు జలమయంగా మారాయి. మరికొన్ని చోట్ల ఏకంగా వీధుల్లో నాలుగు అడుగుల మేర వరద చేరింది. శివార్లలోని కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
Vijayawada భారీ వర్షం..
నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇళ్లు నీటమునిగాయి. రైల్వేట్రాక్ అండర్ పాస్ వద్ద 4 బస్సులు నీట మునగగా క్రేన్ల సాయంతో అధికారులు వాటిని బయటకు తీశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎడ తెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలో 30 ఏళ్లగా ఎన్నడూ లేనంతగా వర్షం కురిసింది. ఒకే రోజు 29 సెం. మీ వర్షపాతం నమోదయింది. గత రెండు రోజులుగా విజయవాడ మహానగరంలో కుండపోత వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆటోనగర్, నుంచి బెంజ్ సర్కిల్ వరకు వరద నీరు భారీగా రహదారిపైకి వచ్చి చేరింది.
వర్షాల కారణంగా గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కారు కొట్టుకుపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయారు. బస్సులు లాంటి భారీ వాహనాలు పడవల మాదిరి మారాయి. మొత్తంగా 69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న విజయవాడ పట్టణంలోని అన్ని కాలనీలు, శివారు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. సరైన డ్రెయిన్లు లేకపోవటం విజయవాడకు శాపంగా మారింది. పడే వాన భారీగా ఉండటం..బయటకు వెళ్లాల్సిన నీళ్ల మార్గం లేకపోవటంతో.. విజయవాడ మొత్తం జలమయంగా మారింది. విజయవాడలో వర్షం 31వ తేదీ (శనివారం) ఉదయం 17సెంటీమీటర్లు అయితే.. సాయంత్రం నాలుగు గంటల నాటికి 12.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.