RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,5:59 pm

ప్రధానాంశాలు:

  •  పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా చేస్తున్నావు అంటూ ప్రశ్నించిన రోజా

RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించి, ప్రజల ఆశలు తుడిచిపెట్టిందని ఆమె విమర్శించారు. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు కనుమరుగయ్యాయని, “సూపర్ సిక్స్” ప్రకటనలు గాలిలో కలిసిపోయాయని ఆరోపించారు. సినిమాల్లోని డైలాగులతో రాజకీయాల్లో ప్రభావం చూపించలేరని చెప్పిన పవన్ కల్యాణ్‌ ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పటికీ షూటింగ్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారని వ్యాఖ్యానించారు.

RK Roja తొక్కిపెట్టి నార తీస్తా నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ రోజా వీడియో

RK Roja : తొక్కిపెట్టి నార తీస్తా.. నువ్వైతే సినిమా డైలాగులు చెప్పొచ్చా పవన్ కళ్యాణ్ .. రోజా వీడియో..!

RK Roja : సుగాలీ ప్రీతి ఫ్యామిలీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వ్యక్తి పవన్ కళ్యాణ్ – రోజా

“ఎన్నికల ముందు సుగాలీ ప్రీతి విషయంలో గొంతెత్తిన పవన్.. గెలిచిన తర్వాత వారికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు” అంటూ ఆర్కే రోజా తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రజలందరికీ చూపే మోసం అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలు తమ ఓటుతో పవన్‌కు గౌరవం ఇచ్చారని, అయితే ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తించకుండా, సినిమా కార్యక్రమాలకే మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలపైన కాకుండా, వ్యక్తిగత ప్రచారం మీదే దృష్టి పెట్టడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం అధికారంలో ఉన్నారని, అయితే మహిళల అక్రమ రవాణాపై ఆయన ఎందుకు నోరు మెదపటం లేదని ఆర్కే రోజా ప్రశ్నించారు. వైఎస్ జగన్ సభలకు జనాన్ని రానివ్వకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో కనిపిస్తుంది. అధికారం శాశ్వతం కాదు. ప్రజలు చూస్తున్నారు.. క్షమించరు అని హెచ్చరించారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గుర్తుంచుకుంటారని రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది