Roja : పవన్ కళ్యాణ్‌ కు ప్యాకేజ్ ఉంటె చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు : రోజా వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : పవన్ కళ్యాణ్‌ కు ప్యాకేజ్ ఉంటె చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు : రోజా వీడియో

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  చెవిలో పువ్వులు పెట్టుకుని వెన్నుపోటు దినంలో రోజా వినూత్న నిరసన

  •  Roja : పవన్ కళ్యాణ్‌ కు ప్యాకేజ్ ఉంటె చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు : రోజా

Roja : వైసీపీ ఆధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి ఆర్కే రోజా చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్న నిరసన చేపట్టారు. తిరుపతిలో నిర్వహించిన “వెన్నుపోటు దినం” కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని ద్రోహించిన వ్యక్తిగా అభివర్ణించారు.

Roja పవన్ కళ్యాణ్‌ కు ప్యాకేజ్ ఉంటె చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు రోజా

Roja : పవన్ కళ్యాణ్‌ కు ప్యాకేజ్ ఉంటె చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు : రోజా

Roja : చెవిలో పువ్వులు పెట్టుకుని వెన్నుపోటు దినంలో రోజా వినూత్న నిరసన

గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా వంటి సంఘటనలు కూటమి ప్రభుత్వ హయాంలో బాగా పెరిగిపోయాయని తెలిపారు. మహిళలపై హింసాత్మక సంఘటనలు, విద్యార్థుల సమస్యలు అధికమవుతున్నాయని ఆమె మండిపడ్డారు. ఏడాది పాలనలో ప్రజలకు ఎటువంటి భద్రతా గ్యారెంటీ లేదని, సంక్షేమం మాట అటుంచితే ప్రాథమిక హక్కులు కూడా లేని స్థితి దాపురించిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పై కూడా తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ముందు ఉత్సాహంగా మాట్లాడిన పవన్, నేడు మహిళలపై జరుగుతున్న దారుణాలపై మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. పౌరులకు గళం కల్పించాల్సిన సమయమిదని, వాగ్దానాలను నెరవేర్చని నారా లోకేష్‌పై కూడా “పప్పు” అనే వ్యాఖ్య చేశారు. చివరగా, రెడ్‌బుక్ పాలనకు బదులు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని, లేకపోతే రోడ్డెక్కి పోరాడతామని హెచ్చరించారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది