Home » Andhra Pradesh » Rs 53 Thousand Has Been Deposited Into The Accounts Of These Farmers
andhra pradesh

Annadata Sukhibhava : ఈ రైతుల‌ అకౌంట్లలోకి మాత్ర‌మే రూ.53 వేలు!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 25, 2025, 6:00 pm
Advertisement

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకం “కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకం” అన్నదాతలకు తీపి కబురు అందించింది. ఈ పథకం కింద వంద ఏళ్లు దాటిన చెట్లను తొలగించి కొత్త చెట్లు నాటేందుకు ప్ర‌భుత్వం రైతులకు భారీ రాయితీలు ఇవ్వ‌నుంది. ఈ పథకం కింద రైతులు తెగుళ్లు సోకిన చెట్లను, కాయలు కాయని చెట్లను తొలగించి కొత్త కొబ్బరి మొక్కలను నాటవచ్చు. ఇందుకు ప్రభుత్వం, కొబ్బరి డెవలప్‌మెంట్ బోర్డు కలిసి భారీ రాయితీలను అందజేస్తోంది…

Advertisement

Annadata Sukhibhava : ఈ రైతుల‌ అకౌంట్లలోకి మాత్ర‌మే రూ.53 వేలు!

పథకం కింద అందే సౌకర్యాలు :

– చెట్ల తొలగింపు రాయితీ
వంద ఏళ్లు దాటిన చెట్లను తొలగించడానికి ఒక్కో చెట్టుకు రూ. 1,000 రాయితీ లభిస్తుంది. హెక్టారుకు 32 చెట్ల వరకు రాయితీ లభించనుంది.
– కొత్త మొక్కల నాటడం
కొత్త కొబ్బరి మొక్కల నాటడానికి ఒక్కో మొక్కకు రూ. 40 రాయితీ లభిస్తుంది. హెక్టారుకు వంద మొక్కల వరకు రాయితీ అందుతుంది.
– ఎరువుల కోసం రాయితీ
నాటిన మొక్కలకు అవసరమైన ఎరువుల కోసం ఏడాదికి రూ. 8,700 రాయితీ పొందొచ్చు. ఈ రాయితీ రెండు సంవత్సరాల పాటు అందుతుంది.

Advertisement

ఎవరికి ప్రయోజనం?

ఈ పథకం ప్రధానంగా కోనసీమ జిల్లా రైతులకు అమితమైన లాభాలను అందిస్తోంది. ముఖ్యంగా కొబ్బరి చెట్లు సాగు చేసే రైతులు ఈ పథకం కింద మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

దరఖాస్తు విధానం

– మీ గ్రామ పంచాయతీ లేదా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించండి.
– అవసరమైన పత్రాలను సమర్పించండి.
– పథకం కింద అర్హత కలిగిన రైతులకు రాయితీ డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి