Sankranthi Kodi Pandalu : ఈ సారి రికార్డ్ స్థాయిలో కోడి పందేల జోరు.. ఒక్క కనుమ రోజే వెయ్యి కోట్లు..!
Sankranthi Kodi Pandalu : ఈ సారి సంక్రాంతికి కోడి పందేల జోరు Sankranthi Kodi Pandalu మాములుగా లేదు. సంక్రాం Sankranthi తి కోడి పందాలు జాతరను తలపించాయి. కొబ్బరి తోటల్లో.. మామిడి తోటల్లో పెద్దఎత్తున కోడి పందాల బరులు దర్శనమిచ్చాయి. పెద్ద పెద్ద కోడి పందాల బరులు ఏర్పాటుతో పాటు.. ఎల్‌ఈడీ స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, కామెంట్రీలతో స్టేడియాల తరహాలో కాక్ ఫైట్‌లు కేక పుట్టించాయి.పండగ 3 రోజుల సందర్భంగా వందల కొద్దీ బరులు నిర్వహించారు. ఈ మూడు రోజుల్లోనే ఏకంగా రూ.2 వేల కోట్ల పందేలు జరిగినట్లు సమాచారం. కోనసీమ నుంచి మొదలుపెడితే రాయలసీమ వరకు పందేలతో హోరెత్తించారు.
Sankranthi Kodi Pandalu : ఈ సారి రికార్డ్ స్థాయిలో కోడి పందేల జోరు.. ఒక్క కనుమ రోజే వెయ్యి కోట్లు..!
సంక్రాంతి Sankranthi తొలి రోజు అయిన భోగి పండగ Bhogi నాడు.. రూ.350 కోట్ల పందేలు సాగినట్టు చెబుతుంగా, ఆ తర్వాతి రోజు ఏకంగా రూ. 600 కోట్లు చేతులు మారాయి. ఇక చివరిదైన కనుమ రోజు మాత్రం పందెం రాయుళ్లు తగ్గేదే లే అనుకుంటూ ఏకంగా వెయ్యి కోట్ల పందేలు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కోడి పందెమే రికార్డుస్థాయిలో రూ. 1.25 కోట్లు పలికినట్లు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం పైబోయిన వెంకటరామయ్యతోటలో జరిగింది ఈ పందెం ఈసారి సంక్రాంతి పండగకు ఏపీలోనే హైలైట్‌గా నిలిచింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమల్లో రూ.500 కోట్ల పందేలు జరిగినట్లు సమాచారం. ఇక కోడిపందేలతో సమానంగా గుండాట కూడా భారీగానే నిర్వహించారు.
ప్రధానంగా కాకినాడ Kakinada జిల్లాలో 3 రోజుల్లో రూ.250 కోట్లకుపైగా పందేలు జరిగాయి. East Godavari తూర్పుగోదావరి జిల్లాలో రూ.150కోట్లు.. కోనసీమ జిల్లాలో రూ.100 కోట్లకుపైగా పందేలు, గుండాట జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపి 1500కిపైగా బరుల్లో రూ.500 కోట్ల పందేలు జరిగనట్లు చెప్పుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, దుగ్గిరాల, ముసునూరు, భుజబలపట్నం, వంటి ప్రాంతాలన్నింటిలోనూ జనం ఎగబడ్డారు. ఏడు నియోజకవర్గాల్లో రోజుకు 350 నుంచి 450 మేర పందెంకట్టిన కోళ్ళు పోటీ పడ్డాయి. పండుగ పూట సరదా అంటూ చిన్నారులు కూడా 500 నుంచి 1500 వరకు పందేల్లో బెట్టింగ్ కాశారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఓడిపోయిన వారు ఉన్నారు.
kajal aggarwal | ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం…
Betel leaf | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (బీట్‌ల్ లీవ్స్) ప్రత్యేక స్థానం పొందిన పౌష్టికవంతమైన ఆకులలో ఒకటి. ఇది…
Honey and Garlic | నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన…
Pomegranate | రక్తం వంటి ఎరుపురంగులో మెరుస్తూ ఆకర్షించే పండు – దానిమ్మ. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.…
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
Copper Sun Vastu Tips | హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష దేవతగా పూజించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాధిపతిగా విశిష్ట స్థానం…
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
This website uses cookies.