Sankranthi Kodi Pandalu : ఈ సారి రికార్డ్ స్థాయిలో కోడి పందేల జోరు.. ఒక్క క‌నుమ రోజే వెయ్యి కోట్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sankranthi Kodi Pandalu : ఈ సారి రికార్డ్ స్థాయిలో కోడి పందేల జోరు.. ఒక్క క‌నుమ రోజే వెయ్యి కోట్లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 January 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Sankranthi Kodi Pandalu : ఈ సారి రికార్డ్ స్థాయిలో పందేల జోరు.. ఒక్క క‌నుమ రోజే వెయ్యి కోట్లు..!

Sankranthi Kodi Pandalu : ఈ సారి సంక్రాంతికి కోడి పందేల జోరు Sankranthi Kodi Pandalu మాములుగా లేదు. సంక్రాం Sankranthi తి కోడి పందాలు జాతరను తలపించాయి. కొబ్బరి తోటల్లో.. మామిడి తోటల్లో పెద్దఎత్తున కోడి పందాల బరులు దర్శనమిచ్చాయి. పెద్ద పెద్ద కోడి పందాల బరులు ఏర్పాటుతో పాటు.. ఎల్‌ఈడీ స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, కామెంట్రీలతో స్టేడియాల తరహాలో కాక్‌ ఫైట్‌లు కేక పుట్టించాయి.పండగ 3 రోజుల సందర్భంగా వందల కొద్దీ బరులు నిర్వహించారు. ఈ మూడు రోజుల్లోనే ఏకంగా రూ.2 వేల కోట్ల పందేలు జరిగినట్లు సమాచారం. కోనసీమ నుంచి మొదలుపెడితే రాయలసీమ వరకు పందేలతో హోరెత్తించారు.

Sankranthi Kodi Pandalu ఈ సారి రికార్డ్ స్థాయిలో కోడి పందేల జోరు ఒక్క క‌నుమ రోజే వెయ్యి కోట్లు

Sankranthi Kodi Pandalu : ఈ సారి రికార్డ్ స్థాయిలో కోడి పందేల జోరు.. ఒక్క క‌నుమ రోజే వెయ్యి కోట్లు..!

Sankranthi Kodi Pandalu : పందేల జోరు..

సంక్రాంతి Sankranthi తొలి రోజు అయిన భోగి పండగ Bhogi  నాడు.. రూ.350 కోట్ల పందేలు సాగిన‌ట్టు చెబుతుంగా, ఆ త‌ర్వాతి రోజు ఏకంగా రూ. 600 కోట్లు చేతులు మారాయి. ఇక చివరిదైన కనుమ రోజు మాత్రం పందెం రాయుళ్లు తగ్గేదే లే అనుకుంటూ ఏకంగా వెయ్యి కోట్ల పందేలు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క కోడి పందెమే రికార్డుస్థాయిలో రూ. 1.25 కోట్లు పలికినట్లు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం పైబోయిన వెంకటరామయ్యతోటలో జరిగింది ఈ పందెం ఈసారి సంక్రాంతి పండగకు ఏపీలోనే హైలైట్‌గా నిలిచింది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, కోనసీమల్లో రూ.500 కోట్ల పందేలు జరిగినట్లు సమాచారం. ఇక కోడిపందేలతో సమానంగా గుండాట కూడా భారీగానే నిర్వహించారు.

ప్రధానంగా కాకినాడ Kakinada జిల్లాలో 3 రోజుల్లో రూ.250 కోట్లకుపైగా పందేలు జరిగాయి.  East Godavari తూర్పుగోదావరి జిల్లాలో రూ.150కోట్లు.. కోనసీమ జిల్లాలో రూ.100 కోట్లకుపైగా పందేలు, గుండాట జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కలిపి 1500కిపైగా బరుల్లో రూ.500 కోట్ల పందేలు జరిగనట్లు చెప్పుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం, చింతలపూడి, దుగ్గిరాల, ముసునూరు, భుజబలపట్నం, వంటి ప్రాంతాలన్నింటిలోనూ జనం ఎగబడ్డారు. ఏడు నియోజకవర్గాల్లో రోజుకు 350 నుంచి 450 మేర పందెంకట్టిన కోళ్ళు పోటీ పడ్డాయి. పండుగ పూట సరదా అంటూ చిన్నారులు కూడా 500 నుంచి 1500 వరకు పందేల్లో బెట్టింగ్‌ కాశారు. రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఓడిపోయిన వారు ఉన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది