Parents Kidnap : ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులను కిడ్నాప్ చేయబోయిన కన్నకొడుకు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Parents Kidnap : ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులను కిడ్నాప్ చేయబోయిన కన్నకొడుకు.. ఎక్కడో తెలుసా?

Parents Kidnap : ఈరోజుల్లో డబ్బు కోసం ఏదైనా చేస్తారు.. చివరకు ఎంతకైనా తెగిస్తారు అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. అవును.. ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులనే కిడ్నాప్ చేయబోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకొని స్థానికులు కూడా విస్తుపోయారు. సొంత కొడుకే ఇంత దారుణానికి ఒడిగట్టబోయాడా అని షాక్ అయ్యారు. అసలు ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని మల్లెపల్లి అనే […]

 Authored By kranthi | The Telugu News | Updated on :21 July 2023,1:00 pm

Parents Kidnap : ఈరోజుల్లో డబ్బు కోసం ఏదైనా చేస్తారు.. చివరకు ఎంతకైనా తెగిస్తారు అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. అవును.. ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులనే కిడ్నాప్ చేయబోయాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకొని స్థానికులు కూడా విస్తుపోయారు. సొంత కొడుకే ఇంత దారుణానికి ఒడిగట్టబోయాడా అని షాక్ అయ్యారు.

అసలు ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలంలోని మల్లెపల్లి అనే గ్రామంలో నాగేశ్వరరావు, లక్ష్మీదేవి అనే దంపతులు నివసిస్తున్నారు. వాళ్లకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు తిప్పరాజు తన తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీదికి మార్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు కానీ.. వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో వాళ్లను కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ల ఆస్తిని తన పేరు మీదికి మార్చుకోవాలనుకున్నాడు. దాని కోసం కిడ్నాప్ కు తెర తీశాడు. కొందరు వ్యక్తులకు సుఫారీ ఇచ్చి తన తల్లిదండ్రులను కిడ్నాప్ చేయాలని చెప్పాడు.నాగేశ్వరరావు, లక్ష్మీదేవి ఇద్దరినీ కిడ్నాప్ చేసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. వాళ్లను కిడ్నాప్ చేస్తున్న సమయంలో పల్లె నిద్ర కోసం వచ్చిన పోలీసులు వాళ్లను చూశారు.

son tried to kidnap his parents for assets in kurnool

son tried to kidnap his parents for assets in kurnool

Parents Kidnap : ఆ తర్వాత ఏం జరిగిందంటే?

దీంతో దుండగులు ఆ దంపతులను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఏం జరిగిందని ఆ దంపతులను పోలీసులు విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ దంపతుల కొడుకును స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు విస్తుపోయారు. ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులనే కిడ్నాప్ చేస్తావా.. అని తిప్పరాజుపై మండిపడుతున్నారు.

Also read

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది