Sunil Kanugolu : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించే విషయంలో ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కానుగోలు వ్యూహాలు బాగా కలిసి వచ్చాయి అనే విషయం అందరికీ తెలిసిందే.అసలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆశలు ఎవరికి లేకపోయినా, సునీల్ కానుగోలు రాజకీయ వ్యవహారాలు బాగా పనిచేయడం తో పాటు , తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి. కాంగ్రెస్ విజయం తరువాత సునీల్ కానుగోలుకు ఆ స్థాయిలోనే కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఇక ఏపీలో జగన్ ఐప్యాక్ టీంని నమ్ముకోగా అంతకమందు ప్రశాంత్ కిషోర్ నడిపించాడు. ఆయన జగన్ అధికారంలోకి వచ్చేలా చేశాడు.
అయితే ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఐప్యాక్ టీం ని ఇపుడు రుషి టీం నడిపిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ లేకుండా రుషి టీం సొంతంగా నడిపించడం వల్లనే 2024 ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓటమి పాలు అయ్యారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. కేవలం 11 సీట్లు వైసీపీకి వచ్చాయీ అంటే ఐప్యాక్ టీం నిర్వాకం వల్లనే జగన్ దెబ్బ తిన్నారు అని రాజకీయ వర్గాలలో జరుగా చర్చలు నడుస్తున్నాయి.అయితే 2019లో 151 సీట్లు సాధించామని చాలా స్ట్రాంగ్‌గా ఉన్న జగన్ ఇప్పుడు పార్టీకి పట్టుకొమ్మల్లాంటి క్యాడర్ దూరం చేసుకున్నారు. ఇప్పుడు వారందరిని తిరిగి తెచ్చుకొని స్ట్రాంగ్‌గా నిలబెట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఎన్నికల ముందు యాక్టివ్ చేసుకోవడానికి రాబిన్ శర్మ ఇచ్చిన సలహా సూచనలు పాటించారు. టీడీపీ అయితే ఐటీడీపీ అని ఒక దాన్ని నడిపారు. దానికి సాలరీలు కూడా ఇచ్చి జగన్ ని బాగా టార్గెట్ చేసి జనంలో వైసీపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసారు. మొత్తానికి అలా అధికారాన్ని సాధించారు.
నిస్తేజంలో ఉన్న వైసీపీ క్యాడర్ ని మళ్లీ యాక్టివ్ చేయాలన్నది వైసీపీ ప్లాన్. ఈ విషయంలో సునీల్ కనుగోలు పూర్తిగా ఆరితేరిన వారు కావడంతో ఆయనతో ఒప్పందానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక ఏపీలో రాజకీయం ఎలా ఉంది. వైసీపీ పరిస్థితి ఉంది ఇవన్నీ విశ్లేషించుకుని కానీ ఏమీ చెప్పలేనని సునీల్ కనుగోలు అన్నారని ఇన్‌సైడ్ టాక్. అయితే జగన్ సునీల్ కనుగోలుకు మంచి ఆఫర్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. దాంతో రానున్న రోజులలో వైసీపీకి సునీల్ కనుగోలు పనిచేస్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.