
Plants : మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే అదృష్టమే అదృష్టం..!
Plants : చాలామందికి ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. అయితే ఇంట్లో పెంచుకునే మొక్కలలో చాలా రకాలు ఉంటాయి. పూలు పండ్లు కూరగాయలు డెకరేషన్ ప్లాంట్ ఇలా అనేక రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవచ్చు. కానీ ఇంట్లో అన్ని రకాల మొక్కలను పెంచకూడదని మీకు తెలుసా..? అయితే ప్రస్తుత కాలంలో చాలామంది వారు ఇంటి పరిసరాలలో మొక్కలను ఎక్కువగా పెంచుతున్నారు. తద్వారా ఇల్లు కూడా చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. అంతేకాక మొక్కలు ఇంట్లో ఉండటం వలన స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించగలుగుతున్నారు. అంతేకాక ఇంట్లో మొక్కలను పెంచుకోవడం వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలలో వెళ్లడైంది. ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే మన ఇంట్లో కొన్ని రకాల మొక్కల్ని పెంచుకోవడం వలన కొన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు కూడా దూరం అవుతాయని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఇది మీ ఇంటి పరిసరాలపై అలాగే ఇంట్లోని వ్యక్తులపై కూడా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి ఆ మొక్కలేంటి ఎలాంటి మొక్కలు ఇంట్లో పెంచుకోవాలి…దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం…
ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కల్లో అనేక రకాల ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలనైనా తగ్గించడానికి తులసి మొక్క ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అందుకే బ్రాహ్మణుల ఇంట్లో తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. దేవుడుగా భావిస్తూ కొలుస్తుంటారు. అయితే ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉండటం వలన నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుందట. అంతేకాక ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు.
ఇంట్లో లిల్లీ మొక్క పెంచుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ మొక్క గాలిని శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. కావున లిల్లీ మొక్క మీ ఇంట్లో ఉండటం శుభప్రదం.
Plants : మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే అదృష్టమే అదృష్టం..!
ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ ని చూస్తున్నాం. ఇక ఈ మొక్క ఎదుగుదలకు సూర్యకాంతి పెద్దగా అవసరం ఉండదు. నీడలో ఉంచి నీరు పోసిన మంచిగా బతికేస్తుంది. అయితే ఈ మొక్కను అదృష్టానికి చిహ్నంగా పెద్దలు చెబుతుంటారు. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
కలబంద…
ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలలో కలబంద మొక్క కూడా ఒకటి అని చెప్పుకోవాలి. కలబంద మొక్కలో ఎన్నో రకాల పోషక గుణాలు ఉంటాయి.చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.