ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసారి ఎలాగైనా సరే వైసీపీ పార్టీని జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు పొత్తుల కొనసాగుతూ వస్తున్నారు. అయితే అధికార వైసీపీ పార్టీ జాబితాలన్నీ విడుదల చేసి ముందంజలో ఉండగా కూటమి తాజాగా సీట్ల సర్దుబాటు పై క్లారిటీ ఇచ్చింది.అయితే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలు ఉండగా 151 స్థానాలలో టిడిపి అభ్యర్థులు, 24 స్థానాలలో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉంటారని అలాగే ఎంపి స్థానాల్లో 3 చోట్ల జనసేన ఉంటుందని మిగిలిన చోట్ల టీడీపీ ఉంటుందని అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే దాదాపు రెండు నెలల నుంచి ఈ పొత్తులో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ తరుణంలో ఎట్టకేలకు కూటమిలో సీట్ల సర్దుబాటు ముగిసింది. అయితే ఇప్పుడు ఈ సీట్లు పంపకం గురించి భారీ ప్రకంపనలు ఈ రెండు పార్టీల నుండి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పాలి.
మరి ఆ ప్రకంపనలు ఏంటి వాటిని అధినేతలు ఎలా ఎదురుకోబోతున్నారు అనే అంశాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం.
ఇక విషయానికొస్తే నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎలాగైనా సరే జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించాలనే ఉద్దేశంతోనే కూటమి అనేది ఏర్పడడం జరిగింది. అయితే ఈ పొత్తు ప్రకటన చేసిన తర్వాత సహజంగా అందరూ ఊహించినట్టుగానే ప్రకంపణలు గట్టిగానే స్టార్ట్ అయ్యాయి.ఇక జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే జాబితాలు విడుదల చేయడం మొదలుపెట్టారో అప్పుడు చాలామంది అసంతృప్తులు బయటికి రావడం జరిగింది. అయితే జగన్ కూడా వరుసగా జాబితాలు జాబితాలు విడుదల చేస్తూ వచ్చారు.ఎందుకంటే అసంతృప్తులు బయటికి వస్తారు… ఎలాంటి పరిస్థితి ఏర్పడబోతోంది…సర్వే సంస్థలు చెప్పినటువంటి మాట ప్రకారం ఎవరు వీక్ గా ఉన్నారు అనే అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా జాబితాలను విడుదల చేస్తూ వచ్చారు. అయితే అలా జాబితాలను విడుదల చేస్తున్నప్పుడు వరుసగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నయని చెప్పాలి.
ఎందుకంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన మాట కచ్చితంగా వినాలి అనే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే అసంతృప్తులు చాలామంది పార్టీలు మారిపోవడం.. పార్టీ నుంచి బయటికి వెళ్లడం.. వేరే పార్టీలో చేరడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో అధికార పక్షంలో ఉన్న వ్యక్తి అభ్యర్థులను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వారి అభ్యర్థులను కంట్రోల్ చేయడం కష్టమని చెప్పాలి. ఇక ఇప్పుడు వీరు కూడా వారి జాబితాలను విడుదల చేయడంతో అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొన్నటి వరకు వైసీపీ పార్టీ ఎదుర్కొన్న అసంతృప్తుల సెగ ఇప్పుడు జనసేన మరియు టీడీపీ పార్టీలో కూడా కనిపించబోతోందని స్పష్టంగా అర్థమవుతుంది. దీని కారణంగా ఓట్ బ్యాంకింగ్ చీలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రకంపనులను పార్టీ అధినేతలు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.