TDP Mahanadu : టీడీపీ ఖతర్నాక్ ప్లాన్.. జగన్ అడ్డాలో మహానాడు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP Mahanadu : టీడీపీ ఖతర్నాక్ ప్లాన్.. జగన్ అడ్డాలో మహానాడు…!

 Authored By ramu | The Telugu News | Updated on :5 May 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP Mahanadu : టీడీపీ ఖతర్నాక్ ప్లాన్.. జగన్ అడ్డాలో మహానాడు...!

TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు కడప జిల్లాలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈసారి ఈ మహానాడు కు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ ఇప్పటివరకు నిర్వహించని స్థలంలో నిర్వహించబోతుంది. గతంలో కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. కానీ ఈసారి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మహానాడు కోసం కడపను ఎంచుకున్నాడు.

TDP Mahanadu టీడీపీ ఖతర్నాక్ ప్లాన్ జగన్ అడ్డాలో మహానాడు

TDP Mahanadu : టీడీపీ ఖతర్నాక్ ప్లాన్.. జగన్ అడ్డాలో మహానాడు…!

TDP Mahanadu : జగన్ అడ్డాలో పసుపు పండుగ

కడప అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సొంత ప్రాంతం కావడంతో ఈ నిర్ణయం పార్టీకి చాలా కీలకంగా మారింది. ముందుగా పులివెందులలో మహానాడు నిర్వహించాలని ఆలోచించింది. పులివెందులపై దృష్టి సారించడం, వైసీపీని రాజకీయంగా ఎదుర్కొనడం అన్నట్లుగా భావించారు. కానీ చివరకు పులివెందులలో కాకుండా కడపలోనే మహానాడు నిర్వహించేందుకు ఫిక్స్ అయ్యింది. కడపలో సీకే దిన్నె మండలంలోని చెర్లోపల్లి మరియు పబ్బవరం గ్రామాల పరిసరాల్లో మహానాడు నిర్వహించడానికి విస్తారమైన భూములను ఎంపిక చేసేపనిలో పడ్డారు పార్టీ నేతలు.

ఈ ప్రాంతం తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో అనుసంధానమైన ప్రాంతంగా ఉండటం, ప్రయాణం కూడా ఈజీగా ఉండడంతో ఇదే బెస్ట్ అని భావిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది