Home » Andhra Pradesh » Telugu Explanation Of Ys Sharmila Atluri Priya Related To Chandrababu Naidu
andhra pradesh

Chandrababu : వై.యస్.షర్మిల కోడలు అట్లూరి ప్రియ చంద్రబాబు నాయుడు బంధువా..??

Authored By
aruna
The Telugu News | Updated on: January 6, 2024 2:21 pm
Advertisement

Chandrababu : వై.యస్.షర్మిల తనయుడు రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అట్లూరి ప్రియ అనే అమ్మాయిని మరికొద్ది రోజుల్లో షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు. వైయస్ ఫ్యామిలీ ఇంటి కోడలు కావడంతో నెటిజెన్స్ అట్లూరి ప్రియ గురించి ఆన్లైన్లో వెతకడం మొదలుపెట్టారు. వై.యస్.షర్మిల కాబోయే కోడలు ప్రియా బ్యాగ్రౌండ్ గురించి రకరకాల వార్తలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి. మొదట అట్లూరి ప్రియ చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలు అని ప్రచారం జరిగింది. అయితే ఆమె అట్లూరి ప్రసాద్ మనవరాలు కాదని తెలిసింది. తాజాగా అట్లూరి ప్రియకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె బ్రదర్ అనిల్ స్నేహితుడు అయిన అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె అని తేలింది.

Advertisement

అమెరికాలో సెటిల్ అయినా అట్లూరి శ్రీనివాస్ అక్కడ బ్రదర్ అనిల్ కు సంబంధించిన కార్యక్రమాలను కూడా ఆయనే పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు ఉండడంతో రాజారెడ్డి ప్రియా మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వచ్చింది. ఇదిలా ఉంటే అట్లూరి ప్రియ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. జగన్ ను శత్రువుగా భావించే సామాజిక వర్గం నుంచి షర్మిల కోడలు తెచ్చుకోవడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అట్లూరి ప్రియ చంద్రబాబు బంధువు అవుతారని కొందరు కామెంట్ చేస్తుంటే, మరికొందరు షర్మిల జగన్ కాదని బయటికి వెళ్లినప్పుడే ఆమెతో మన బంధం తెగిపోయిందని ఆమె గురించి ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

అయితే అట్లూరి ప్రియకు చంద్రబాబుకు మధ్య ఎటువంటి బంధుత్వం లేదని తెలుస్తోంది. కానీ సోషల్ మీడియాలో వివిధ రకాలుగా వార్తలు రాస్తున్నారు. అట్లూరి ప్రియ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో నారా చంద్రబాబు నాయుడు బంధువని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వై.యస్.షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి చేరి సంచలనంగా మారారు. సీఎం అయ్యేంత సీను లేదు కానీ వై.యస్.జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడే అవకాశం ఉంటుంది. వై.యస్.షర్మిల కాంగ్రెస్ చేరికతో వైసీపీలో సీట్లు దక్కని వాళ్లంతా కాంగ్రెస్లోకి చేరుతారు. దీంతో వైయస్ జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడే అవకాశం ఉంటుంది. వ్యతిరేక ఓటును చీల్చిన వారవుతారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఆసక్తికరంగా మారింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి