Gannavaram TDP: గన్నవరంలో టెన్షన్ వాతావరణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై వంశీ అనుచరుల దాడి..!!
Gannavaram TDP: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గన్నవరం టిడిపి ఆఫీస్ పై వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ ఆఫీస్ అద్దాలు మరియు ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. కర్రలతో రోడ్లపైకి వల్లభనేని వంశి అనుచరులు రావడంతో వారిని అడ్డుకోవడానికి పోలీసులు.. తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
వివాదానికి కారణం చూస్తే రెండు రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబుపై మరియు నారా లోకేష్ పై వంశీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో గన్నవరం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వంశీ పై మండిపడ్డారు. ఈ పరిణామంతో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వద్ద గందరగోళం నెలకొంది. ఇరు వర్గాలను చేదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వల్లభనేని వంశీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయం నుంచి జాతీయ రహదారిపై నిరసనగా బయలుదేరి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే వంశీ అరాచకాలు నశించాలి అంటూ నినాదాలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు చుట్టూ వంశీ కారులో తిరుగుతున్నారని వారు ఆరోపించారు. పార్టీ ఆఫీస్ వద్ద పోలీసులు ఉన్నా పట్టించుకోని పరిస్థితిని మండిపడ్డారు. పార్టీ కార్యాలయం పై జరిగిన దాడిలో దాదాపు 50 నుంచి 60 మంది వైసీపీ నేతలు పాల్గొన్నారు అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.