Unda valli Sridevi : రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని అని చెప్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జగన్ మోహన్ రెడ్డిని వదిలి వెబ్ కి వ్యతిరేకంగా పార్టీ కి వ్యతిరేకంగా ఓటు వేసి పార్టీలో నుండి సస్పెండ్ అయ్యి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడ కూడా దారుణంగా మోసపోయారు ఉండవల్లి శ్రీదేవి అనే మాట ఇప్పుడు వైసీపీ శ్రేణులతో పాటు తెలుగుదేశం శ్రేణులలో కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది.అయితే ఇప్పుడు ఆమె అడుగులు ఎటు ఉన్నాయి. ఆమె అపాయింట్మెంట్ జగన్ కోరుకుంటున్నారా..? కోరుకుంటే ఏం అడగబోతున్నారు..? ఇక జగన్ మోహన్ రెడ్డి రెస్పాన్స్ ఈ విషయంలో ఎలా ఉంది…? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుస్తుంది ప్రయత్నం చేద్దాం.అయితే పార్టీ నుంచి బయట రావడం వేరు వచ్చాక మాట్లాడే మాటలు వేరు. అయితే ఉండవల్లి శ్రీదేవి వైసీపీ పార్టీ ని వదిలి వెళ్ళినపుడు జగన్ మోహన్ రెడ్డిని చాలా మాటలు అన్నారు. మరి ఇప్పుడు జగన్ ఎలా రియాక్ట్ అవుతరో ఇప్పుడు తెలుసుకుందాం.. విషయంలోకి వెళితే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ టికెట్ ఇస్తుందా అంటే ఇవ్వదు అని చెప్పాలి. ఒకవేళ ఇస్తే ఆమె కోరుకున్న నియోజకవర్గంతో పాటు ఆ చుట్టుపక్కల నియోజకవర్గంలో ఇచ్చే అవకాశాలు కొంచెం కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె తాటికొండకు మాజీ ఎమ్మెల్యే.
కాని టీడీపీ ఇప్పుడు తాటికొండను తీసుకువెళ్లి శ్రవణ్ కుమార్ చేతిలో పెట్టారు. ఈ శ్రవణ్ కుమార్ గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే ఉండవల్లి శ్రీదేవి గట్టిగా మోసపోయారు అని తెలిసిపోతుంది. ఇక తాడికొండ నుంచి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కు మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో శ్రీదేవికి టికెట్ లేకుండా పోయింది. ఇక వేరే నియోజకవర్గంలో అయిన టికెట్టు కల్పిస్తారా అంటే గుంటూరు , కృష్ణాజిల్లాలో ఎస్సీ నియోజకవర్గంలో సీట్లు నిండిపోయాయి. గుంటూరులో వేమూరి ఎస్టి నియోజకవర్గం మీద నక్క ఆనంద్ బాబు ఉన్నారు. ఇదే జిల్లాలో పత్తిపాడు రామాంజనేయులకు కేటాయించారు. కృష్ణాజిల్లా, నందిగామ , తిరువూరు మిగతా సీట్లన్నీ కూడా నిండిపోయాయి. అయితే ప్రస్తుతం ఆమెకు ఎక్కడ సీట్ లేకపోవడంతో శ్రీదేవికి ఇది పెద్ద తలకాయ నొప్పిగా మారిపోయింది. దీంతో ఆమె వైసీపీ కి వెళ్దామని ఆమె సపోర్టుగా ఉండే అనుచరులు కొంతమంది చెబుతున్నారు. ఎందుకంటే తాటికొండకు వైసీపీ ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయలేదు. మళ్లీ వైసీపీకి వెళ్లి ప్రయత్నాలు చేసుకుందాం టికెట్ గురించి అడుగుదాం.. అనవసరంగా వచ్చాం అని ఒక క్షమాపణ చెప్పడం లేదా డిస్కషన్ చేద్దామని ఆమె అనుచరులు చెబుతున్నట్టుగా సమాచారం.
ఎందుకంటే ఒకప్పుడు బొత్స సత్యనారాయణ విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో ఆన్ రికార్డ్ బయట మీడియాలో ఆన్ రికార్డు లో తిట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాని ఆయనే ప్రస్తుతం వైసీపీలో బిగ్గెస్ట్ లీడర్ గా ఉన్నారు. ఆయన ఇష్టం వచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డిని తిట్టిన చరిత్ర కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నప్పుడు ఇక ఇప్పుడు నేను కూడా వెళ్తే తప్పేంటి అని ఆలోచనలో ఉండవల్లి శ్రీదేవి ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే తాడేపల్లి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం ఈమె ప్రయత్నాలు చేస్తున్నారు అనే మాట గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా తెలుగుదేశం పార్టీ తనకు ద్రోహం చేసిందని మళ్లీ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లేటువంటి అవకాశాలు ఉంటే చూడమని ఆమె అనుచరులు ఆమెకు సలహాలు ఇస్తున్నారని సమాచారం. మరి ఈ విషయంపై మీకున్న రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.