Undavalli Arun kumar : ఉండవల్లి అరుణ్ కుమార్ సర్వే .. ఏపీ సీఎం అతనే..!
Undavalli Arun kumar : ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతున్నారు అనేదానిపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు.ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. తర్వాత జరిగిన పరిణామాలతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి ఆయనను ఎండగట్టే ప్రయత్నం చేసేవారు.పోలవరం, ఏపీ విభజన చట్టంలోని హామీలు, ఏపీ ని విడదీసిన దానిపై వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు పై సీరియస్ అయ్యేవారు. గడిచిన ఏడాదికాలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్ జగన్ మీద దూకుడు తగ్గించారు. వైయస్ జగన్ కు సంబంధించిన అంశాలలో రెండు మూడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి మేలు జరిగాయి. వైయస్ జగన్ ప్రభుత్వ పరంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కి సంబంధించి అంశాలలో ఉండవల్లి అరుణ్ కుమార్ కి అడ్డుకట్ట వేశారు. విభజన కేసు పై ఉండవల్లి అరుణ్ కుమార్ పదేళ్లు గా పోరాడుతున్నారు.
ఆయనకు సపోర్టుగా ఏపీ ప్రభుత్వం ఆఫిడవిట్ వేసింది. అప్పటినుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ దూకుడు తగ్గింది. వైయస్ జగన్ పట్ల కాస్త సైలెంట్ గా ఉంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణ ప్రకారం సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలు అకౌంట్లోకి వేస్తున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరు అని, ఎక్కడా లంచాలకు తావు లేకుండా వాలంటీర్లను ఉపయోగించుకొని ఆ డబ్బును అకౌంట్లోకి వేస్తున్నారు. ఇది ప్రజలకు నచ్చుతుంది. పట్టణాలలో కన్నా పల్లెటూర్లలో ప్రజలు వైయస్ జగన్ మళ్ళీ వస్తే మనకు డబ్బు వస్తుందని ఆలోచన చేస్తున్నారు. ఆ విశ్లేషణ ఉపయోగించుకొని ఇన్ డైరెక్ట్ గా వైయస్ జగన్ కి ఫేవర్ గా ఉండబోతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు.
ఏపీలో అభివృద్ధి లేదని రోడ్లు లేవని టీడీపీ కి సంబంధించిన మీడియా హైలెట్ చేస్తున్న ప్రజలు సంక్షేమ పథకాలపై మొగ్గుచూపుతున్నారు. కాబట్టి ఎవరికి ఓటేస్తారు అనేది చూడాలి అని ఆయన అంటున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ సీఎం గా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల అకౌంట్లోకి పడుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఆయనే సీఎం గా వస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారు. కానీ ఏపీలో అభివృద్ధి లేదని యువతకు ఉద్యోగం రాలేదని పరిశ్రమలు లేవని అంటున్నారు కానీ పేద ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యాయి మరియు ముఖ్యంగా గ్రామాలలో ప్రజలు వైయస్ జగన్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఎవరు గెలుస్తారు చివరిదాకా చెప్పలేని పరిస్థితి.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.