
Vallabhaneni Vamsi : గన్నవరంలో వంశీకి మూసుకుపోతున్న దారులు.. చుక్కలు చూపించేందుకు దుట్టా సిద్ధం?
Vallabhaneni Vamsi : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో రాజకీయాలు అన్నీ ఒకవైపు అయితే.. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు వేరు. అందులో గన్నవరం రాజకీయాలు ఇంకా డిఫరెంట్. గన్నవరం రాజకీయాల గురించి చెప్పాలంటే మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి వల్లభనేని వంశీ. ఆయన గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో రెబల్ గా మారి ఆ తర్వాత వైసీపీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు వల్లభనేని వంశీ.. సీఎం జగన్ కి ఆప్తుడు. ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఉంది.
టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండి.. టీడీపీ హైకమాండ్ పై, టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో వల్లభనేని వంశీ గురించి ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. అదంతా పక్కన పెడితే గన్నవరంలో ఉన్న వైసీపీ నేతలకు, వల్లభనేని వంశీకి అస్సలు పడటం లేదు. దానికి కారణం.. టీడీపీలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ.. వైసీపీ నేతలపై చేసిన విమర్శలు. ఇప్పుడు ఆయన జగన్ కు అనుకూలంగా మారినా కూడా ఆయనపై వైసీపీ నేతలు గుర్రుగానే ఉన్నారు.గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని వంశీ గెలిచింది కేవలం 800 ఓట్ల తేడాతోనే. కానీ.. ఆయన గెలిచాక వైసీపీలో ఉన్న నేతలు యార్లగడ్డ, దుట్ట.. ఈ ఇద్దరి పట్ట ఆయన చూపించిన వైఖరి వల్ల యార్లగడ్డ చివరకు టీడీపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. టీడీపీ కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రస్తుతం సీరియస్ గా తీసుకుంది.
Vallabhaneni Vamsi : గన్నవరంలో వంశీకి మూసుకుపోతున్న దారులు.. చుక్కలు చూపించేందుకు దుట్టా సిద్ధం?
వైసీపీలో గన్నవరంలో కీలక నేత అంటే.. దుట్ట రామచంద్రా రావు అనే చెప్పుకోవాలి. ఆయన చాలా ఏళ్ల నుంచి వైసీపీ కోసం పని చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో దుట్టా వైసీపీ నుంచి పోటీ చేశారు. అందుకే గన్నవరంలో ఆయన కీలక నేతగా ఉన్నారు. కానీ.. దుట్ట.. వల్లభనేని వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరుపున వల్లభనేనికి టికెట్ ఇస్తే మాత్రం అస్సలు ఆయనకు సహకరించేది లేదని దుట్టా తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.