Home » Andhra Pradesh » Venu Swamy About Junior Ntr Political Entry
andhra pradesh

Venu Swamy : ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ముహూర్తం ఫిక్స్.. అది ఎప్పుడో చెప్పిన వేణు స్వామి..!

Authored By
aruna
The Telugu News | Published on: January 21, 2024, 2:15 pm
Advertisement

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ నిత్యం వార్తలో నిలుస్తున్నారు. ఇప్పటికే చాలామంది జాతకాలు చెప్పినా ఆయన మరోసారి జూనియర్ ఎన్టీఆర్ జాతకం గురించి చెప్పి సెన్సేషనల్ గా మారారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలినిని వేణు స్వామి తిరుపతిలో కలిశారట. అక్కడ ఎన్టీఆర్ జాతకం గురించి ఆమెకు చెప్పగా ఆమె ఆశ్చర్యపోయారని వేణు స్వామి తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకతోనే ఒక సమస్యతో పుట్టారని, ఆ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తల్లికి చెప్పానని అన్నారు. అయితే ఎన్టీఆర్ కు దోషం ఉన్నట్లు సీనియర్ ఎన్టీఆర్ కు, తనకు, హరికృష్ణకు మాత్రమే తెలుసు అని మీకు ఎలా తెలుస్తుంది అని ఆమె ఆశ్చర్యపోయారని వేణుస్వామి అన్నారు.

Advertisement

దీంతో వేణు స్వామి నాకు అన్ని తెలుసు అని, ఎన్టీఆర్ ది మఖా నక్షత్రమని, తమిళ నాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా అదే నక్షత్రం అని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి చాలా సమయం ఉందని, 2030 వరకు జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాలలోకి రావద్దని వేణు స్వామి జూనియర్ ఎన్టీఆర్ తల్లి కి చెప్పారట. జూనియర్ ఎన్టీఆర్ తాతకి రాజయోగం ఎలా ఉండేదో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అలాగే రాజయోగం పడుతుందని, ఆయన నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటాయని వేణు స్వామి అన్నారు. అయితే వేణు స్వామి జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న దోషం గురించి మాత్రం చెప్పలేదు. అది ఏ దోషం అయి ఉంటుందా అని నెటిజన్ల మధ్య చర్చ జరుగుతుంది.

ఇకపోతే నందమూరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని వాదన ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానివ్వకుండా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై నందమూరి ఫ్యామిలీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ కొందరు జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాలపై ఆసక్తి ఉండడంతో రాజకీయాలలోకి రావాలనుకోవడం లేదని అంటున్నారు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చిన ఎవరు అడ్డుకోరని ఆయనను ఆపే శక్తి ఎవరికీ లేదని అంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి