TDP : తన చెప్పుతో తానే కొట్టుకున్న టీడీపీ నాయకుడు వీడియో..!!

Authored By Breaking News | The Telugu News | Published on: July 31, 2023, 6:51 pm

TDP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిందని ప్రత్యర్థులు అంటున్నారు. చంద్రబాబుకి వయసు మీద పడటంతో పాటు ఆ పార్టీలో.. చంద్రబాబు తర్వాత ముందుకు నడిపించే నాయకుడు లేరని అంటున్నారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో సైతం టీడీపీకి అభ్యర్థులు కూడా కరువైనట్లు ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీగా చలామణి అవుతున్న చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మీడియా సమావేశాలలో చాలాసార్లు అసహనం వ్యక్తం చేయడం తెలిసిందే. కానీ తాజాగా మాత్రం ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు తన చెప్పుతో తానే కొట్టుకొని ఆవేదనకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ రామరాజు తన చెప్పుతో తానే కొట్టుకోవడం జరిగింది. గెలిచి 30 నెలలు అయినా గాని ఒక్క పని కూడా తాను చేసుకోలేకపోయానని కౌన్సిల్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

video of tdp leader hitting himself with his sandal

video of tdp leader hitting himself with his sandal

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన కౌన్సిలర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో ఎవరు శుభ్రం చేయడం లేదు అదే సమయంలో లైట్లు కూడా వేయడం లేదని ఇదంతా తన కర్మ అన్నట్టు.. ఆ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ చెప్పుతో తన చెంపలు కొట్టుకుని అసహనం వ్యక్తం చేశారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp