Vijayasai Reddy : జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లడలేదు.. చెత్త పత్రికల్లో రాస్తున్న వార్తలు నమ్మోద్దు.. విజయసాయి రెడ్డి క్లారిటీ
Vijayasai Reddy : విజయసాయి రెడ్డి వైసీపీ నుండి బయటకు రావడంతో ఆయనని కొందరు దారుణంగా తిట్టిపోస్తున్నారు. దానిపై ఇటీవల స్పందించిన విజయసాయి రెడ్డి నన్ను కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను. నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్నవారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేని ఈ కోటరీ అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 ప్రాధాన్యత కావాలనుకుంటున్న వారికి ప్రయోజనం ఉండవచ్చేమో కానీ.. జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు అని అన్నారు.
Vijayasai Reddy : జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లడలేదు.. చెత్త పత్రికల్లో రాస్తున్న వార్తలు నమ్మోద్దు.. విజయసాయి రెడ్డి క్లారిటీ
ఇక తాజాగా విజయసాయి రెడ్డి తన ఎక్స్‌లో జగన్ గారికి వ్యతిరేకంగా నేను తిరుపతిలో, వైజాగ్ లో మాట్టాడినట్లు కొన్ని ఊరూ పేరూ లేని పత్రికలు, టీవీ చానళ్ళు చేస్తున్న ప్రచారం నా దృష్టికి వచ్చింది. జగన్ గారికి వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ గానీ, ఆన్ రికార్డు గానీ నేను ఎక్కడా మాట్లాడలేదు. కోటరీ వల్ల, విభేదించి పార్టీ వదిలానే కానీ, జగన్ గారికి హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదు.
నేను రాజకీయాల్లో లేను. ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో నాకు శతృత్వం లేదు. నేను ఏ విషయం మాట్లాడదలచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతా. లేదా నా అధికారిక ‘ఎక్స్’ ద్వారా తెలియజేస్తా. తెరవెనుక బాగోతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవు. నా పేరిట అవాస్తవాలు ప్రచారం చేయటానికి ఉబలాటపడుతున్న వారు నల్ల కోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, చెత్త పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని కోరుతున్నాను అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు..
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
Kasivinda Plant | చెన్నంగి లేదా కసివింద అని పిలువబడే ఈ మొక్కకు అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న చెన్నంగి,…
Aloevera juice | కలబంద అద్భుతమై మూలిక. ఈ జ్యూస్‌లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3,…
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
This website uses cookies.