Balineni Srinivasa Reddy : వైయస్సార్ సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తీర్ణ రెండుసార్లు చేశారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా నడిచింది. అయితే ప్రజలకు రాజకీయ వర్గాలకు బాలిలేని శ్రీనివాసరెడ్డికి అసలు ఏమి కావాలి అని ప్రశ్నిస్తున్నారు. ఆయన అధిష్టానం పై పలుమార్లు అలిగారు, కోప్పడ్డారు, ఆవేదన చెందారు. టీడీపీ తో మంతనాలు చేస్తున్నారు. కొద్దిసేపట్లో ఆయన టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు అని కథనాలు కూడా వచ్చాయి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట్ల శ్రీనివాసరెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. తన టికెట్ కోసం ఆయన పోరాటం చేయకుండా మాగుంట్ల శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అయితే బాలినేనికి వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ను ఎప్పుడో ఖరారు చేసింది. ఇప్పటికే వైయస్ జగన్ 61 మంది అభ్యర్థులను మార్చారు. ఎవరు టికెట్ వారు కాపాడుకొనే గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో వైయస్ జగన్ కు సన్నిహితుడు, చుట్టమైన బాలినేని శ్రీనివాస రెడ్డికి ఎమ్మెల్యేగా టికెట్ ను కన్ఫామ్ చేశారు. అయితే మాగుంట్ల శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ కావాలని కోరుతున్నారు. వీరిద్దరూ ఎంతో సన్నిహితులు కావడంతో అ టికెట్ ఆయనకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రెండవది తన నియోజకవర్గంలో పాతికవేల మందికి ఇల్లు నిర్మించాలని, పట్టాలు పంపించడానికి డబ్బు కావాలి అని బాలినేని అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే అందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.
ఇక మాగుంట్ల శ్రీనివాసరెడ్డి బాలినేనికి చాలా అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలోనే మాగుంట్ల ఎంపీగా ఉంటే తన నియోజకవర్గం పైన ప్రభావం పడుతుందని, తద్వారా తనకు ఎక్కువగా ఓట్లు వస్తాయని ఫీలింగ్ తో బాలినేని ఆలోచన చేస్తున్నారు. అధిష్టానం ఎదిరించైనా సరే మాగుంట్ల కు టికెట్ ఇప్పించాలని పట్టుదలతో ఉన్నారు. రీసెంట్ గా వైయస్ జగన్ ను కలవడానికి కూడా బాలినేని వెళ్లారట. అయితే వైయస్ జగన్ బిజీగా ఉండడంతో అతడిని కలవలేదట. దీంతో బాలినేని అలిగారట. తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత వైసీపీ ఇవ్వడం లేదని మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి కనిపించారు. మాగుంట్లకు ఎంపీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా ఈజీగా గెలవచ్చు అని బాలినేని చూస్తున్నారు. అయితే అధిష్టానం అందుకు ఒప్పుకోవడం లేనట్లుగా తెలుస్తుంది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.