Home » Andhra Pradesh » Ycp Trolling Nagababu
andhra pradesh

YCP Trolling Nagababu : నాగబాబు ను ఓ రేంజ్ లో వేసుకుంటున్న నెటిజన్లు !! కారణం ఆ వ్యాఖ్యలే !!

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Published on: February 5, 2026, 4:00 pm
Advertisement

YCP Trolling Nagababu : మెగా బ్రదర్ , జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డారు. ఆ మధ్య హీరోయిన్ల డ్రెస్ విషయంలో శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చి అందరి చేత ఛీ అనిపించుకున్న నాగబాబు..ఇటీవల పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సైలెంట్ గా ఉండి జనసేన శ్రేణులతో పాటు మెగా అభిమానుల తో చివాట్లు తిన్నారు. అంతే ఎందుకు పవన్ కళ్యాణ్ సైతం క్లాస్ పీకాడు. తమ్ముడి క్లాస్ తో ఖంగు తిన్న మెగా బ్రదర్ నెక్స్ట్ డే నే ఓ వీడియో రిలీజ్ చేసాడు. అయితే ఇప్పుడు ఆ వీడియో తోను ట్రోల్ బారినపడ్డారు.

Advertisement

YCP Trolling Nagababu : నాగబాబు ను ఓ రేంజ్ లో వేసుకుంటున్న నెటిజన్లు !! కారణం ఆ వ్యాఖ్యలే !!

దీనికి ప్రధాన కారణం ఆయన గతంలో చేసిన ‘నాస్తిక’ వ్యాఖ్యలకు, ఇప్పుడు చెప్తున్న ‘సనాతన ధర్మ’ సిద్ధాంతాలకు పొంతన లేకపోవడమే. తిరుమల లడ్డూ వివాదంపై జనసేన నాయకులు మౌనంగా ఉండటం పట్ల పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడం, ముఖ్యంగా నాగబాబుకు క్లాస్ పీకడంతో ఆయన వెంటనే స్పందించి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అయితే, ఈ వీడియోలో ఆయన తనను తాను “సనాతన హిందువును” అని ప్రకటించుకోవడంపై నెటిజన్లు ఆయన పాత ఇంటర్వ్యూలను బయటకు తీసి ఏకిపారేస్తున్నారు.

Advertisement

తాను పక్కా నాస్తికుడినని, దేవుడు లేడని బలంగా నమ్ముతానని స్పష్టం

గతంలో ఒక ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో నాగబాబు తాను పక్కా నాస్తికుడినని, దేవుడు లేడని బలంగా నమ్ముతానని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉంగరాలు పెట్టుకుని, యజ్ఞయాగాదులు చేసినా.. గత ఏడెనిమిదేళ్లుగా తనకు దైవచింతన లేదని, కేవలం మానవత్వాన్ని మాత్రమే నమ్ముతానని ఆయన అప్పట్లో చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా విడుదల చేసిన వీడియోలో మాత్రం “నేను సనాతన హిందువును.. హిందూత్వం అనేది మతం కాదు, అదొక ధర్మం” అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఈ ఒక్క రోజులోనే నాగబాబులో వచ్చిన ఈ మార్పును చూసి నెటిజన్లు “సందర్భాన్ని బట్టి రంగులు మార్చడం అంటే ఇదేనా?” అంటూ విమర్శిస్తున్నారు.

తమ్ముడి క్లాస్ తో దేవుళ్ళు గుర్తొచ్చారు

వైసీపీ హయాంలో ఆలయాలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్ దగ్గర తిట్లు పడటంతోనే నాగబాబుకు అకస్మాత్తుగా హిందూ ధర్మం గుర్తుకు వచ్చిందని, రాజకీయ లబ్ధి కోసమే ఈ ‘డ్యూయల్ మైండ్‌సెట్’ ప్రదర్శిస్తున్నారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తిరుమల లడ్డూ పవిత్రత గురించి మాట్లాడే ముందు, తన సొంత సిద్ధాంతాల పట్ల స్పష్టత ఉండాలని విమర్శలు వ్యెక్తం చేస్తున్నారు. మరి ఈ వరుస ట్రోల్స్‌పై మెగా బ్రదర్ ఎలా స్పందిస్తారో, తన సనాతన ధర్మ ప్రచారాన్ని ఇలాగే కొనసాగిస్తారో లేదో చూడాలి.

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి