Adiseshu Sunkesula : వైయస్ షర్మిల వెన్నుపోటు పొడిచింది... సంచలన నిజాలు బయటపెట్టిన ఆదిశేషు సుంకేసుల...!
Adiseshu Sunkesula : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది దీనిని ఉపయోగించుకొని ఫేమస్ అయ్యారు. అయితే కొందరు వారి టాలెంట్ ను చూపిస్తూ ఫేమస్ అయితే మరి కొందరు కామెడీ వీడియోస్ వంట ప్రోగ్రామ్స్ వంటివి కూడా చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో స్టార్ యూట్యూబర్ ఆదిశేషు సుంకేసుల కూడా ఒకరు అని చెప్పాలి. అయితే ఆదిశేషు సుంకేసుల ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఇతను మొదట యూట్యూబ్ లో పలు రకాల కామెడీ వీడియోలు , ఫ్రాంక్ వీడియోలు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆదిశేషు యూట్యూబ్ లో మంచి సక్సెస్ అందుకుని యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు. అయితే ఆదిశేషు సుంకేసుల యూట్యూబ్ , ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్ ను ఉపయోగించుకొని సోషల్ మీడియా స్టార్ గా ఎదిగాడు.
అయితే ఆదిశేషు సుంకేసుల వైయస్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని. వైయస్ జగన్మోహన్ రెడ్డిని దేవుడు కంటే ఎక్కువగా ఆరాధించే వ్యక్తి. సోషల్ మీడియాలో కూడా రాజకీయాలకు సంబంధించి పలు రకాల విషయాలు మాట్లాడుతూ ఆదిశేషు ఫేమస్ అయ్యారు. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆదిశేషు ను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిశేషు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి, అలాగే వైయస్ షర్మిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదిశేషు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఆయనకు ఉన్న ఇష్టాన్ని జగన్ నాయకత్వాన్ని వివరిస్తూ వచ్చారు. అనంతరం యాంకర్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెబుతాను మీ అభిప్రాయం చెప్పాలి అంటూ చంద్రబాబు నాయుడు పేరు చెప్పగా ఆదిశేషు సమాధానం ఇస్తూ …చంద్రబాబు నాయుడు గురించి తెలియదు మాట్లాడుకోవడం అనవసరం అంటూ సమాధానం ఇచ్చాడు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి అసలు ఊహించనని , ఆలోచించనని తెలియజేసాడు. జగన్మోహన్ రెడ్డి దేవుడు, పులి , కింగ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వైయస్ షర్మిల గురించి అడగగా ఆదిశేషు వెన్నుపోటు అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో వెంటనే యాంకర్ వెన్నుపోటు ఏంటి అని ప్రశ్నించగా…ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదని మీరు అభిప్రాయం అడిగారు కాబట్టి అదొకటే చెప్తానంటూ జగన్ అభిమాని ఆదిశేషు కామెంట్స్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆదిశేషు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…
Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…
Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…
Akhanda 2 | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ చిత్రం ‘అఖండ 2’ ప్రస్తుతం షూటింగ్…
This website uses cookies.