Home » Andhra Pradesh » Ys Jagan Ambati Rambabu Ysrcp Latest News
andhra pradesh

YS Jagan : జగన్ చేసిన పనికి రగిలిపోతున్న అంబటి రాంబాబు..?

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Published on: February 22, 2026, 4:00 pm
Advertisement

YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో Ysrcp Party  ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంతర్గత పోరు నడుస్తోందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి Ambati Rambabu  అంబటి రాంబాబు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా పార్టీ కోసం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys jagan mohan reddy కోసం గట్టిగా గొంతు వినిపిస్తూ, ప్రత్యర్థులపై విరుచుకుపడే అంబటి రాంబాబు.. ప్రస్తుతం తన సొంత పార్టీ నుండే సరైన మద్దతు లభించడం లేదని తీవ్ర అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం జగన్ అనుసరిస్తున్న తీరేనని టీడీపీ అనుకూల మీడియా కథనాలు వండివారుస్తున్నాయి.

Advertisement

YS Jagan : జగన్ చేసిన పనికి రగిలిపోతున్న అంబటి రాంబాబు..?

ముఖ్యంగా ఇటీవల అంబటి రాంబాబు ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు, జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడు పార్టీ అధిష్టానం నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది. పార్టీ కోసం ఎంతగానో కష్టపడిన తనకు, కనీసం న్యాయపరమైన సహాయం అందించడంలో జగన్ విఫలమయ్యారని అంబటి రగిలిపోతున్నట్లు సమాచారం. పార్టీలోని కీలక నేతలు సైతం ఈ విషయంలో మౌనంగా ఉండటం ఆయనకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. తనను ఒంటరిని చేశారనే భావన ఆయనలో బలంగా నాటుకుపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.మరోవైపు, ఇటీవల తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించిన సమయంలో జరిగిన పరిణామాలు ఆయనను తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ వారు తన ఇంటి మీదకు వచ్చి నానా హంగామా చేస్తున్నా, కనీసం ఒక్క వైకాపా కార్యకర్త గానీ, నాయకుడు గానీ తన ఇంటికి వచ్చి మద్దతు తెలపకపోవడం అంబటిని షాక్‌కు గురిచేసింది.

Advertisement

YS Jagan సొంత వాళ్లే ముఖం చాటేయడం

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరినీ వెనుకేసుకొచ్చిన తనకు, ఇప్పుడు ఆపద కాలంలో సొంత వాళ్లే ముఖం చాటేయడం ఏమిటని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.ఈ క్రమంలోనే “జగన్ చేసిన పనికి రగిలిపోతున్న అంబటి?” అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన నేతలను జగన్ విస్మరిస్తున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అంబటి రాంబాబు వంటి ఫైర్ బ్రాండ్ నేతనే ఇలా ఒంటరిని చేస్తే, ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో మొదలైంది. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే, రానున్న రోజుల్లో అంబటి రాంబాబు పార్టీ మారుతారా లేక మౌనంగానే ఉండిపోతారా అన్నది వేచి చూడాలి. ప్రస్తుతం మాత్రం వైకాపాలో ఈ ‘కోల్డ్ వార్’ సెగలు రేపుతోంది.దీనిపై పార్టీ అధిష్టానం ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

 

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి