Ys Jagan : ఒకే ఒక్క స్పీచ్ తో పవన్, బాలయ్య పరువు తీసేసిన సీఎం జగన్ వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : ఒకే ఒక్క స్పీచ్ తో పవన్, బాలయ్య పరువు తీసేసిన సీఎం జగన్ వీడియో వైరల్..!!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల వెంకటగిరిలో జరిగిన చేనేత నేస్తం బహిరంగ సభలో వాలంటీర్ల వ్యక్తిత్వంపై కామెంట్లు చేసిన ప్రత్యర్థులకు జగన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్, లోకేష్, చంద్రబాబుతో పాటు బాలకృష్ణ పై మండి పడటం జరిగింది. ప్రజలకు మంచి చేసే వ్యవస్థలను అభినందించాల్సింది పోయి వారిని అవమానిస్తున్నారు. వరదలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఉదయమే అవ్వదాతలకు పెన్షన్ మొదటి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :23 July 2023,12:00 pm

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల వెంకటగిరిలో జరిగిన చేనేత నేస్తం బహిరంగ సభలో వాలంటీర్ల వ్యక్తిత్వంపై కామెంట్లు చేసిన ప్రత్యర్థులకు జగన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్, లోకేష్, చంద్రబాబుతో పాటు బాలకృష్ణ పై మండి పడటం జరిగింది. ప్రజలకు మంచి చేసే వ్యవస్థలను అభినందించాల్సింది పోయి వారిని అవమానిస్తున్నారు. వరదలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఉదయమే అవ్వదాతలకు పెన్షన్ మొదటి తారీకు నాడే వారి చేతికి ఇస్తున్నారు.

కుటుంబ సభ్యులు మాదిరిగా అందరికీ సేవ చేస్తున్నారు. అటువంటి వాలంటీర్లను కించపరుస్తూ ఓ ప్యాకేజీ స్టార్ కామెంట్లు చేయడం దురదృష్టకరం. చాలామందిని పెళ్లిళ్లు చేసుకుని.. తర్వాత వదిలేసే ఇటువంటి వ్యక్తి వాలంటీర్ల వ్యక్తిత్వంపై వ్యాఖ్యానించటం మరీ విడ్డూరం. ఇక ఇదే బహిరంగ సభలో బాలకృష్ణ ఉద్దేశించి అమ్మాయి కనపడితే ముద్దయిన పెట్టేయాలి… కడుపైన చేసేయాలి.. అంటూ అప్పట్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సీఎం జగన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Ys Jagan Comments on Pawan Kalyan and Balakrishna

Ys Jagan Comments on Pawan Kalyan and Balakrishna

ఇక చంద్రబాబును ఉద్దేశించి .. నేను వయసులో ఉన్నప్పుడు చేసిన పనులు.. నువ్వు సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడు కూడా చేసి ఉండవు.. అంటూ మరొకరు కామెంట్లు చేశారు. ఇలాంటి వాళ్లు ప్రజలకు నిస్వార్ధంగా పనిచేస్తున్న వాలంటీర్లపై వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కామెంట్లు చేయడం దురదృష్టకరమని.. వెంకటగిరి సభలో స్పష్టం చేశారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది