Ys Jagan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని మ‌రోసారి టార్గెట్ చేసిన వైఎస్‌ జ‌గ‌న్.. బాబు సంక‌లో పిల్లి అంటూ నాన్‌స్టాప్ పంచ్‌లు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: April 20, 2024, 7:00 pm
  •  Ys Jagan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని మ‌రోసారి టార్గెట్ చేసిన వైఎస్‌ జ‌గ‌న్.. బాబు సంక‌లో పిల్లి అంటూ నాన్‌స్టాప్ పంచ్‌లు..!

Ys Jagan : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతుంది. ఒకరిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వైఎస్‌ జ‌గ‌న్ కూడా ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర 18వ రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగ‌గా, అక్కడ ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . కులాన్ని హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేయగలననే భ్రమలో పవన్ ఉన్నారంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. … పవన్ కు ఎన్ని టిక్కెట్లు ఇవ్వాలో, ఎక్కడెక్కడ ఇవ్వాలో, ఆయాస్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలో, ఆఖరికి దత్తపుత్రుడు కూడా ఎక్కడ పోటీ చేయాలో చంద్రబాబే ఫిక్స్ చేసిన కూటమి ఇదంటూ జ‌గ‌న్ త‌నదైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

Ys Jagan : ప‌వ‌న్‌ని అన్ని మాట‌లు అన్నాడేంటి?

చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితిలో పవన్ ఉన్నారని అన్నారు. 80 సీట్లు కాదు.. 20 సీట్లు ఇస్తామన్నా కూడా జీ హుజూర్ అని ద‌త్త‌పుత్రుడు అనాల్సిందే. ఒక‌వైపు రాష్ట్రాన్ని దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే… మ‌రోవైపు కులాన్ని హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేయగలనన్న భ్రమతో పవన్ కల్యాణ్ చెత్త రాజ‌కీయాలు చేస్తున్నాడంటూ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు వైఎస్‌ జ‌గ‌న్. పవన్ కు రాష్ట్రం అంతే ఎంతచులకనంటే అతడికి జ్వరం వస్తే పిఠాపురాన్ని వదలి హైదరాబాద్ వెళ్లిపోయేటంత చులకన అని జ‌గ‌న్ అన్నారు. గ‌తంలో వన్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక అనే మూడు నియోజకవర్గాలుంటే.. ఇప్పుడు పిఠాపురం నాలుగోదని చెప్పిన జగన్… ఈ మ్యారేజీ స్టార్ కు ఏ ప్రాంతమన్నా ప్రేమ ఉండదు, ఏ భార్య అన్నా ప్రేమ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ys Jagan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని మ‌రోసారి టార్గెట్ చేసిన వైఎస్‌ జ‌గ‌న్.. బాబు సంక‌లో పిల్లి అంటూ నాన్‌స్టాప్ పంచ్‌లు..!

Ys Jagan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని మ‌రోసారి టార్గెట్ చేసిన వైఎస్‌ జ‌గ‌న్.. బాబు సంక‌లో పిల్లి అంటూ నాన్‌స్టాప్ పంచ్‌లు..!

పెళ్లిల్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగేసి అయ్యాయ‌ని మ‌రోసారి ప‌వ‌న్ పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చి విమ‌ర్శ‌లు గుప్పించారు. పెళ్లికి పిఠాపురం వెళ్తూ పిల్లిని చంకనపెట్టుకుని వెళ్లాడని ఒక సామెత ఉంది.. చంద్రబాబు తన సంకలో ఉన్న పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వాదిలాడని.. ఇది గాజు గ్లాసు పరిస్థితి అని జగన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాజు గ్లాసులో గ‌ట గ‌ట తాగేది చంద్ర‌బాబు, దానిని క‌డిగి శుభ్రం చేసి ఇచ్చేది ప‌వ‌న్ కళ్యాణ్ అని జ‌గ‌న్ అన్నారు. మ‌రి జ‌గ‌న్ చేసిన ఈ విమ‌ర్శ‌ల‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ రేంజ్‌లో స్పందిస్తాడా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp