
YS Jagan : నా నాలుగో పెళ్ళాం నువ్వే జగన్...చీర కట్టుకొని ఇంటికి రా...పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...
YS Jagan : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా సరే జగన్ సీఎం కూర్చిని లాగేసుకోవాలని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మొదటి జాబితా విడుదల చేసిన కూటమి ఇప్పుడు పొత్తులో భాగంగా భారీ బహిరంగ సభలను కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ మరియు జనసేన పొత్తులో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఇక ఈ భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రె రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్లు 2 విడాకులు..ఇక ఇప్పుడు నాలుగు పెళ్లిళ్లు నలుగురు పెళ్ళాలు అని కూడా సంబోధిస్తున్నాడు. నాకు తెలియని ఆ నాలుగు పెళ్లి ఏంటో ఆ నాలుగు పెళ్ళం ఎవరో…నాకు తెలియని నాలుగు పెళ్ళం అంటే అది నువ్వే అయి ఉంటావు జగన్ రా మరి అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. అదేవిధంగా నా భార్యల గురించి చంద్రబాబు గారి సతీమణి గురించి జగన్ మోహన్ రెడ్డి చాలా అసభ్యకరంగా మాట్లాడతాడని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా వైయస్ భారతి మేడం మిమ్మల్ని మేము చాలా గౌరవంగా భారతి మేడం అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక ఆడపడుచుకు మేము ఇచ్చే గౌరవం అది. కానీ నీ భర్తకు మాత్రం అవేమి పట్టనట్టుగా పెళ్ళాలు అని సంబోధిస్తూ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. నీ భర్త అన్నట్లు గా నేను కూడా మిమ్మల్ని అని ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచన చేయండి అంటూ తేలియజేశారు. నాకు తెలుగులో బూతులు మాట్లాడడం వచ్చు అని నేను ఇంగ్లీష్ మీడియం చదువుకొని రాలేదని నేను కూడా తెలుగు మాట్లాడగలనని.. కానీ ఒక ఆడపడుచుకి ఇవ్వాల్సిన గౌరవం కొద్ది మిమ్మల్ని మేడం అని పిలుస్తూ ఉంటాను. అలా మీ భర్త కూడా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
అలాగే జగన్ నీకు చెబుతున్న విను పవన్ కళ్యాణ్ అంటే నీ దృష్టిలో మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు కానీ పవన్ కళ్యాణ్ అంటే రేపటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు , పవన్ కళ్యాణ్ అంటే ఈ దేశపు యువత కళలు , పవన్ కళ్యాణ్ అంటే కన్నీరు తుడిచే చేయి, పవన్ కళ్యాణ్ అంటే అర్ధరాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉంటే పరిగెత్తుకుని వచ్చే 108 అంబులెన్స్ , పవన్ కళ్యాణ్ అంటే ఆడపిల్లలకి రక్షణగా చేతికి కట్టే రాఖి , పవన్ కళ్యాణ్ అంటే పెద్దల భుజంపై ఉండే కండువా , పవన్ కళ్యాణ్ అంటే గర్వంతో ఎగిరే జాతీయ జెండా అంటూ పవన్ కళ్యాణ్ ఈ భారీ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను మొత్తంగా ముంచేసే తుఫాన్ అంటూ జగన్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరియు రాజకీయపరంగా పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.