
Ys Sharmila : వివేకానంద హత్య కేసు పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్.... వారిద్దరే గొడ్డలితో నరికి చంపారు...!
Ys Sharmila : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైయస్ఆర్ కుటుంబాల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే వైయస్ జగన్ కు వ్యతిరేకంగా వైయస్ షర్మిల మరియు వైయస్ వివేకానంద కూతురు వయసు సునీత దీటుగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సునీత మరియు షర్మిల ఓ పర్యటనలో భాగంగా ప్రజల సమక్షంలో మాట్లాడుతూ వివేకానంద హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ సునీత మాట్లాడుతూ…మా నాన్న వివేకానంద కడప జిల్లా నుండి షర్మిల పోటీ చేయాలని ఎంతో తాపత్రయపడ్డారు. ఆమె రాజకీయాల్లో ఎదగడాన్ని కల్లారా చూడాలనుకున్నారు. ఇక ఆ కారణం వల్లనే ఆయన్ని అత్యంత క్రూరంగా గొడ్డలితో నరికి చంపారు. ఇక ఇప్పుడు ఆ హత్య చేయించిన వాళ్లే మళ్లీ ఎంపీగా పోటీ చేయబోతున్నారు.నిజంగా ఇప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఇవన్నీ చూసే సహించేవాడా.
ఆయన తమ్ముని క్రూరంగా రాజకీయాల కోసం చంపినా ఎం పట్టనట్టు మౌనంగా ఉండేవాడా…తన కూతురు వైఎస్ షర్మిల ని ఈ విధంగా కష్టపేడుతుంటే చూసే సహించేవాడా అంటూ సునీత వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రజలందరూ మీ ఓటు హక్కుతో షర్మిలమ్మకు ఓటు వేసి మీ యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలిసేలా తెలియజేయాలంటూ సునీత చెప్పుకొచ్చారు. అనంతరం మాట్లాడిన వైయస్ షర్మిల ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేశారు. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పుడు కడప రాజకీయాలను మనం చూస్తున్నాం. గతంలో ఇదే కడప జిల్లాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు, వైయస్ వివేకానంద రెడ్డి గారు నాయకులుగా వ్యవహరించారు. ఇక వారు నాయకులుగా ఉన్న సమయంలోవారిద్దరూ ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ ప్రజలు కష్టాలను ఎలా తీర్చారో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు లేరు , ఇక వివేకానంద రెడ్డి గారిని రాజకీయాల కోసం అతి క్రూరంగా దారుణంగా నడిరోడ్డుపై గొడ్డలితో నరికి మరీ చంపించారు .
Ys Sharmila : వివేకానంద హత్య కేసు పై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్…. వారిద్దరే గొడ్డలితో నరికి చంపారు…!
ఇవన్నీ మన కళ్ళముందేే జరిగాయి. హత్య చేయించిన అవినాష్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా జైలుకు వెళ్లలేదు అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా ఇప్పుడు వాడే కడప జిల్లాలో పోటీ చేస్తున్నాడు. బాబాయ్ హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నప్పటికీ ఈ కేసు పై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వైయస్ జగన్ అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని ఈ అంతకులను కాపాడుతున్నారంటూ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. బాబాయ్ హత్య కేసులో జగన్ పాత్ర కూడా ఉండటం వల్లనే ఈ కేసును ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారంటూ షర్మిల తెలియజేశారు. ఇలాంటి హంతకులకు అధికారం ఇచ్చి మరోసారి తప్పు చేయవద్దంటూ ఈసారి కడప జిల్లాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వివేకానంద కలను నిజం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ , షర్మిల తెలియజేశారు. దీంతో ప్రస్తుతం షర్మిల మరియు సునిత చేసిన వ్యాఖ్యలు కడప రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.