YS Sharmila : జ‌గ‌న్ , మోడీ, బాబు 420 లు అంటూ.. ఏపీ ప్ర‌త్యేక హోదాపై కంట‌త‌డితో వైఎస్ ష‌ర్మిల‌..!

YS Sharmila : ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వై.యస్ షర్మిల 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీతో పాటు టీడీపీ మరియు జనసేన పార్టీలపై వై.యస్ షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా తాను పనిచేస్తానని చెప్పుకొస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా షర్మిల ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల తో పాటు ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతిజ్ఞ చేశారు . అయితే తాజాగా కాంగ్రెస్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్ షర్మిల ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో విడిపోయి దాదాపు పది సంవత్సరాలు అవుతుందని, అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రత్యేక హోదా ఊసే లేదని వ్యాఖ్యానించారు.

ఇక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వై.యస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా పై ఆలోచన లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు అయితే హోదా అంటే ఏంటో కూడా తెలియని విధంగా ప్రవర్తిస్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు.అందుకే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేపడుతున్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ తన భుజాలపై ఎత్తుకుందని ఇక ఈ ఉద్యమం ఉవ్వెత్తున జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ విధంగా జరగకపోతే ప్రత్యేక హోదా అస్సలు సాధించలేమని ఈ సందర్భంగా వై.యస్ షర్మిల చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రత్యేక హోదా విషయంలో దాదాపు 10 ఏళ్లపాటు మనం గొర్రెలు అయ్యామని , అందుకే వారు మనల్ని బలి పశువుల్లాగా బలి తీసుకుంటున్నారని తెలియజేశారు. మనం గొర్రెల మాదిరిగా కాకుండా ప్రత్యేక హోదా కోసం సింహంలా పోరాటం చేయాలని ఈ సందర్భంగా వై.యస్ షర్మిల పిలుపునిచ్చారు.అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేసిన మోదీ ఒక డీఫాల్ట్ అని మోడీ ఒక కేడి అంటూ వై.యస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే ఇప్పటికే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని…కానీ మన రాష్ట్ర రాజకీయ నాయకులైన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక హోదాపై అసలు ఊసే లేదంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.

తన వ్యక్తిగత లాభాల కోసం ఆంధ్ర రాజకీయాల్లోకి రాలేదని కేవలం ప్రత్యేక హోదా సాధించే దిశగా అలాగే విభజన సమస్యల సాధన కోసం ఆమె ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టారని తెలియజేశారు. అందుకే ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ శ్రేణులు అందరూ ఉద్యమించాల్సి ఉందని ప్రత్యేక హోదా పొందేందుకు ఖచ్చితంగా పోరాడాలని ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికే 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా రాజధాని లేకపోవడం దురదృష్టకరమని తెలియజేశారు. అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం 25 ఏళ్ల వెనక్కి పడిపోయిందని అందుకే ప్రత్యేక హోదా సాధించాలని ఇక అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వై.యస్ షర్మిల తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఆమె ఎంతకైనా తెగిస్తానని పలువురు నేతలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. దీంతో ప్రస్తుతం వై.యస్ షర్మిల చేసిన కామెంట్స్ ఆంధ్ర రాజకీయాలల్లో తీవ్ర చర్చానియాంశంగా మారాయి.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

10 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

12 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

16 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

19 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

22 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

2 days ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

2 days ago