YS Sowbhagyamma : వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఆ తర్వాత వైఎస్ సునీత కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్లి ఆయనే వివేకానంద రెడ్డి చావుకి కారణమైన వాళ్ళని కాపాడుతున్నారని వాదనలు వినిపించడం జరిగింది. అలాగే సిబిఐ కూడా అఫిడబిట్ లో అవినాష్ పేరు భాస్కర్ రెడ్డి పేరు చెప్పడం భాస్కర్ రెడ్డి జైలుకు కూడా వెళ్లడం జరిగింది. అయితే దస్తగిరి వీరి పేర్లను బయటపెట్టాడు అని వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపించాయి. ఈ సంఘటనల నేపథ్యంలో వివెకానంద రెడ్డి ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ లు రెండుగా విడిపోయారని చెప్పాలి. అయితే వివేకానంద రెడ్డిని చంపిన వారిని కాపాడాల్సిన పరిస్థితి తన అన్న జగన్ కి ఎందుకు పట్టింది. జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి అయిన వివేకానంద రెడ్డిని చంపిన వారిని ఎందుకు జగన్ వెనకేసుకుని వచ్చారు అనే కోపం ఖచ్చితంగా వైయస్ సునీతకు ఉంటుంది. అందుకే ఆమె లీగల్ గా కూడా పోరాటాలు చేస్తున్నారు.ఇక ఈమె పోరాటానికి ఎవరైనా సరే మద్దతు ఇవ్వాల్సిందే.ఎందుకంటే తన తండ్రిని చంపిన వాళ్ళు ఎవరు అనేది లీగల్ గా బయటపడాలని ఆమె ప్రయత్నిస్తుంది.
అయితే ఆ విషయాన్ని యాదగిరి స్పష్టం చేశారు అని అందరికీ తెలుసు కానీ చంపిన వారి కంటే కూడా చంపించిన వారు మెయిన్ విల్లన్ అవుతారు. ఏ కేసులోనైనా సరే చంపిన వారి కంటే కూడా చంపిచ్చిన వారే మెయిన్ క్రిమినల్ అవుతారు. ఇది సుప్రీంకోర్టు ఎప్పటినుండో చెబుతున్నారు. అంతేకాక దీనిని ఎప్పటినుండి ఫాలో కూడా అవుతున్నారు.ఈ నేపథ్యంలో వైయస్ అవినాష్ రెడ్డికి వైయస్ సునీతకు నడుస్తున్నటువంటి గొడవలు విభేదాల నేపథ్యంలో వైయస్ సునీత అవినాష్ రెడ్డి పై పోటీ చేయాలని భావిస్తున్నారు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే ఇడుపులపాయ లో కలుసుకున్నటువంటి వైఎస్ షర్మిల సునీత ఈ విషయంపై మాట్లాడుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే వైయస్ సునీతని షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసిందట . కానీ సునీత రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపించకపోవడంతో కొత్త ప్లాన్ తో తెర మీదకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేంటంటే వైఎస్ సౌభాగ్యమ్మ. వైయస్ వివేకానంద రెడ్డి గారి యొక్క భార్య వైఎస్ సౌభాగ్యమ్మ కడప ఎంపీగా ఇండిపెండెంట్ క్యాండెట్ గా వైయస్ అవినాష్ రెడ్డి పై పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకరకంగా ఇది అవినాష్ రెడ్డి పై పగ తీర్చుకోవటం ఆయనను దెబ్బతీయడానికి అని అర్థమవుతుంది.
అయితే కాంగ్రెస్ తరపున కాకుండా మారే ఇతర పార్టీ తరఫున కాకుండా ఇండిపెండెంట్ గా సౌభాగ్యమ్మ పోటీ చేస్తే మాత్రం ఒకపక్క తెలుగుదేశం పార్టీ కాండేట్ ని పెట్టకుండా వెనకడుగు వేస్తారు. ఇక తన కుటుంబానికి చెందినవారు కాబట్టి వైయస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి అభ్యర్థిని నియమించే ప్రయత్నం చేయకుండా ఉంటుంది. ఇక బిజెపి విషయానికొస్తే వైయస్ వివేకానంద రెడ్డి హత్యను అర్థం చేసుకున్నట్లయితే బిజెపి కూడా దూరంగానే ఉంటుందని చెప్పాలి. ఇదే గినకు జరిగితే కడప ఎంపీ సీటు వైయస్ సౌభాగ్యమ్మ మరియు వైఎస్ అవినాష్ రెడ్డి గా మారే అవకాశం కనిపిస్తుంది. అయితే కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని జగన్ నియమిస్తే కచ్చితంగా సౌభాగ్యమ్మ ఇండిపెండెంట్ గా కడప ఎంపీ కి పోటీ చేస్తారు. ఇక ఇది కచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డికి తలకాయ నొప్పి అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.