Viral Video : ఫుల్లుగా తాగి అంబులెన్స్ కి ఫోన్ చేసిన ఓ వ్యక్తి .. వీడియో
Viral Video : త్రాగిన మత్తులో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారు. ఆ మైకంలో వారు ఏం చేస్తుంటారో, ఏం మాట్లాడుతారో కూడా తెలియదు. ఇలాంటి వ్యక్తులు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియాలో కూడా ఫుల్లుగా త్రాగి ఉన్న వ్యక్తులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటారు. ఆ మత్తులో వారు చేసే పనులను, మాట్లాడే తీరును వీడియో తీసి నెట్టింటా పెడుతూ ఉంటారు. అలాంటి వీడియోలు ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిని చూసి నవ్వుకుంటూ ఉంటాము. ఇక తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రమేష్ అనే వ్యక్తి ఫుల్లుగా త్రాగినట్లుగా తెలుస్తుంది. అతడు మాట్లాడే తీరు చూస్తే మద్యం సేవించినట్లుగా ఉన్నాడు. ఆ మత్తులో అతడు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఏకంగా అంబులెన్స్ కి ఫోన్ చేసినట్లుగా ఉన్నాడు.
రమేష్ హైదరాబాదు నుంచి జనగాం వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు బాగా త్రాగి అర్ధరాత్రి సమయంలో జనగాం వెళ్ళేందుకు ఎటువంటి వాహనాలు లేక ఏకంగా అంబులెన్స్ కి ఫోన్ చేశాడు. ఇక అంబులెన్స్ అంటే ఏంటో అందరికీ తెలిసిందే . ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ కోసం ఆసుపత్రికి తీసుకువెళుతుంది. అయితే అలాంటి అంబులెన్స్ ను ఈ వ్యక్తి తన ఊరు జనగాం కు వెళ్లేందుకు 108 కి ఫోన్ చేసి పిలిపించాడు. దీంతో అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ అంబులెన్స్ అనేది కేవలం ఎమర్జెన్సీ కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్ళేది మాత్రమే అని చెప్పారు. అయినా కూడా ఆ వ్యక్తి నాకు కూడా ఎమర్జెన్సీ నే జనగాం తీసుకువెళ్లండి అని అంటాడు. దీంతో రమేష్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా అనిపించాయి.
నాకు జనగాం వెళ్లేందుకు ఓపిక లేదని, ఈ అర్ధరాత్రి సమయంలో వాహనాలు కూడా అందుబాటులో లేవని, అందుకే అంబులెన్స్ కి ఫోన్ చేశానని నన్ను జనగాం తీసుకువెళ్లండి అని రమేష్ అంబులెన్స్ సిబ్బందితో వాదించాడు. దీంతో వారు అంబులెన్స్ ను ఎమర్జెన్సీ అయితే ఆసుపత్రికి తీసుకెళుతుందని ఇలా ఊరు తీసుకు వెళ్లడానికి కాదని వారించారు. భువనగిరి ఆసుపత్రికి తీసుకువెళతామని అంబులెన్స్ సిబ్బంది అంటారు కానీ రమేష్ నేను ఎమర్జెన్సీగా జనగాం వెళ్లాలని అంటాడు. అంబులెన్స్ అనేది ఆరోగ్యం బాగోకపోతే ఆస్పత్రికి తీసుకువెళతారు బస్సు లేకపోతే తీసుకువెళ్లడానికి కాదని అంబులెన్స్ సిబ్బంది అతడితో అంటారు. దీంతో ఈ వీడియో హాస్యాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…
This website uses cookies.