Ysrcp Minister : మళ్లీ వైసీపీకే పట్టం.. మంత్రులు వీరేనట..!
ప్రధానాంశాలు:
Ysrcp Minister : మళ్లీ వైసీపీకే పట్టం.. మంత్రులు వీరేనట..!
Ysrcp Minister : ఏపీలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది అని చెప్పాలి. మే 13న ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్దుల ప్రకటన తుది దశకు చేరుకుంది. ఇక హోరా హోరీగా ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఓటమే లక్ష్యంగా 2014 తరహాలో తిరిగి మూడు పార్టీలు కూటమిగా పోటీ చేస్తుండగా, పలు సర్వేలు కూడా ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. జగన్ ప్రభుత్వంమే తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. లోక్ సభ తో పాటుగా అసెంబ్లీకి జరగనున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు సిద్ధం కావడంతో అంతా ఆసక్తి నెలకొంది.మరోవైపు అభిమానులు కూడా తమ పార్టీ గెలుస్తుంది అంటే తమ పార్టీ గెలుస్తుందంటూ జోస్యాలు చెబుతున్నారు.
Ysrcp Minister : మంత్రులు వీరేనట..
మరోవైపు మంత్రులు వీరేనంటూ ఇప్పటికే జోస్యాలు చెబుతున్నారు. విశాఖ జిల్లాలో వైసీపీ నుంచి చాలా మందే మంత్రి రేసులో ఉండగా, వారిలో ముందుగా విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్న ఎంవీవీ సత్యనారాయణ గురించి చెప్పుకోవాలి. ఆయన మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ఆయనకు మంత్రి పదవి దక్కనుందని చెబుతున్నారు. హ్యాట్రిక్ విజేత అయిన వెలగపూడి రామక్రిష్ణ బాబుని ఓడించడం కష్టం. మరోవైపు విశాఖ సౌత్ నుంచి వైసీపీ నుంచి పోటీలో ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ కూడ ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అవుతారు. బీసీ సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి దక్కడం ఖాయమని భావిస్తున్నారు అని అంటున్నారు.

Ysrcp Minister : మళ్లీ వైసీపీకే పట్టం.. మంత్రులు వీరేనట..!
గాజువాక నుంచి మంత్రిగా ఉంటూనే పోటీ చేస్తున్న గుడివాడ అమర్నాధ్ కిమంత్రి పదవి లభిస్తుంది అని ఆయన అభిమానులు అంటున్నారు. ఈసారి ముప్పయి వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుస్తాను అని అంటున్నారు. ఈసారి తమ నాయకుడికి సామాజిక కోటాతో పాటు నర్శీపట్నం నుంచి కోటాలో కూడా మంత్రి పదవి తధ్యమని ఆయన వర్గం అంటోంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి గెలుస్తాను అని ఆయన గట్టి నమ్మకం మీద ఉన్నారు. పాయకరావుపేటకు వచ్చిన కంబాల జోగులు అక్కడ కూడా వైసీపీ జెండా పాతితే మంత్రి పదవి అదే ఇంటికి వస్తుందని అంటున్నారు.వీరే కాదు అరడజనుకి పైగా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. మరి రానున్న రోజులలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.