Ysrcp : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పలు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఫిబ్రవరి 5న తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఈసీని కోరామని.. అయితే ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, మార్చి 12వ తేదీన ఫీజు పోరు నిర్వహించాలని నిర్ణయించినట్లు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.3,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలను టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ వైసీపీ ఈ ఫీజు పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
‘రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిశాక మార్చి 12న ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించాం’ అని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఇక నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌లకు వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. మరోవైపు గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు రూ.1,780 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెడితే.. తాము అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ఆ బకాయిలు విడుదల చేశారని వైసీపీ చెప్తోంది.
Sai Pallavi : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సాయి పల్లవి తన మార్క్ నటనతో మెప్పిస్తూ ప్రేక్షకుల…
Caste Resolution : తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ ఇటీవల చేపట్టిన కుల గణన సర్వే ను నేడు కేబిఎట్…
Pulivendula : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు పులివెందులకు ఉప ఎన్నిక జరగవచ్చని పేర్కొంటూ ఒక…
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఊహించిన డెసిషన్ తీసుకుంటూ పలు దేశాలకు…
Savings Accounts : ఆర్థిక నిర్వహణలో ముఖ్యమైన అంశం బ్యాంకు లావాదేవీలకు, ముఖ్యంగా నగదు డిపాజిట్లకు సంబంధించిన నియమాలు. ప్రతి…
Allu Aravind : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై రీసెంట్ గా తండేల్ ప్రీ…
Flower : హిమాలయాలలో మాత్రమే లభించే ఈ పువ్వు గురించి ఎప్పుడైనా విన్నారా.. అయితే ఈ పువ్వు బురాన్ష్.. ఇది…
Chicken and Mutton Livers : ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ ని ఇష్టంగా తింటుంటారు.…
This website uses cookies.