Ysrcp : వైసీపీకి ఎదురు దెబ్బ‌.. ఆ నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డం వెన‌క కార‌ణం ఏంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : వైసీపీకి ఎదురు దెబ్బ‌.. ఆ నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డం వెన‌క కార‌ణం ఏంటి ?

 Authored By ramu | The Telugu News | Updated on :4 February 2025,9:20 pm

ప్రధానాంశాలు:

  •  Ysrcp : వైసీపీకి ఎదురు దెబ్బ‌.. ఆ నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డం వెన‌క కార‌ణం ఏంటి ?

Ysrcp : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్‌ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందంటూ వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పలు జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఫిబ్రవరి 5న తలపెట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Ysrcp వైసీపీకి ఎదురు దెబ్బ‌ ఆ నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డం వెన‌క కార‌ణం ఏంటి

Ysrcp : వైసీపీకి ఎదురు దెబ్బ‌.. ఆ నిర్ణ‌యాన్ని మార్చుకోవ‌డం వెన‌క కార‌ణం ఏంటి ?

Ysrcp మ‌రో దెబ్బ‌..

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున, ఫీజు పోరు కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఈసీని కోరామని.. అయితే ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత, మార్చి 12వ తేదీన ఫీజు పోరు నిర్వహించాలని నిర్ణయించినట్లు తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.3,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ వైసీపీ ఈ ఫీజు పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

‘రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిశాక మార్చి 12న ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించాం’ అని వైఎస్సార్‌సీపీ సోష‌ల్ మీడియాలో తెలియ‌జేసింది. ఇక నిరసన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా కలెక్టర్‌లకు వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. మరోవైపు గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు రూ.1,780 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెడితే.. తాము అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ఆ బకాయిలు విడుదల చేశారని వైసీపీ చెప్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది