
YCP : కూటమి విజయం తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి వరకు కళకళలాడిన కుప్పం బైపాస్ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం.. హోటల్ అమరావతిగా మారిపోయోంది. ఎన్నికల తర్వాత కార్యాలయం ఖాళీ కావడంతో.. ఆ భవన యజమాని హోటల్‌గా మార్చేస్తున్నారు. త్వరలో హోటల్ అమరావతి ప్రారంభిస్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు వైపుగా వెళుతున్న వారు ఈ మార్పు చూసి షాకవుతున్నారు. ఏంది వైసీపీ పరిస్థితి ఇలా మారిందని అందరు చర్చించుకుంటున్నారు.
వైసీపీ పార్టీకి చెందిన నియోజకవర్గంలోని 14 మంది ఎంపీటీసీలు, ఐదుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వారు పార్టీలో చేరి పసుపు కండువా కప్పుకొన్నారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన వైసీపీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం మండలాలకు చెందిన ఎంపీటీసీలు మంగళవారం సాయంత్రం ఆయా మండలాల టీడీపీ నాయకులతో కలిసి విజయవాడకు చేరుకుని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను కలిశారు. బుధవారం ఉదయం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడ వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు చంద్రబాబు స్వయంగా పసుపు కండువాలు కప్పి, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారితో సమావేశమయ్యారు.
సుమారు 8 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 20 మంది సర్పంచులు, 60 మంది ఎంపీటీసీలు అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లాంచనంగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఇప్పుడు వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. అతి త్వరలో కుప్పం నుంచి పలువురు వైసీపీ నాయకులూ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే 175 స్థానాల్లోనూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి 164 స్థానాల్లో గెలుపొందింది. ఇక వైసీపీ ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెప్పిన కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ పై చంద్రబాబు 48,006 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో… కుప్పంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని మూసివేసినట్లు కథనాలొస్తున్నాయి. అందుకు గల పలు కారణాలూ తెరపైకి వస్తున్నాయి.
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
This website uses cookies.